న్యూఢిల్లీ: 15వ ఫైనాన్స్ కమిషన్ పదవీ కాలాన్ని కేంద్ర కేబినెట్ పొడిగించింది. కమిషన్ పదవీ కాలాన్ని 2020 అక్టోబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు బుధవారం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. 2019 అక్టోబర్ వరకు ఉన్న కమిషన్ పదవీ కాలాన్ని తొలుత 2019 నవంబర్ 30 వరకు పొడిగించారు. అనంతరం దీనిని మరోమారు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పన్నులు, ఇతర వనరుల విభజనపై ఫైనాన్స్ కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి నివేదికను అందించేందుకు విధించిన గడువును 2020 అక్టోబర్ 30 వరకు పొడిగించింది. ఇక 2021–22 నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన అంశాలను సైతం తుది నివేదికలో పొందుపరచాలని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment