జమ్మూకశ్మీర్‌లో 20, జార్ఖండ్‌లో 16 సీట్లకు రేపు పోలింగ్
జమ్మూ/రాంచీ: జమ్మూకశ్మీర్, జార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారానికి గురువారంతో తెరపడింది. ఐదు దశల్లో చివరిదైన ఆఖరి దశ ఎన్నికలు శనివారం (20వ తేదీన) జరగనున్నాయి. కశ్మీర్‌లోని 20 స్థానాలు, జార్ఖండ్‌లోని 16 సీట్లకు పోలింగ్ జరగనుంది. ఈ దశలో పలువురు ప్రముఖ నేతలు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కశ్మీర్‌లోని జమ్మూ, రాజౌరి, కథువా జిల్లాల్లోని 20 స్థానాల్లో 213 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక జార్ఖండ్‌లోని 16 నియోజకవర్గాల్లో 208 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్‌తో పాటు పలువురు మంత్రులు ఎన్నికల బరిలో ఉన్నారు. కాగా, జమ్మూ సమీపంలోని బోర్ క్యాంప్ వద్ద గురువారం ప్రచారానికి వెళ్లిన బీజేపీ నేత, మాజీ క్రికెటర్ సిద్దూ కాన్వాయ్‌పై కొందరు దుండగులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో కాన్వాయ్‌లోని ఓ వాహన డ్రైవర్ గాయపడ్డాడు.
తుది దశ ప్రచారానికి తెర
Published Fri, Dec 19 2014 2:56 AM | Last Updated on Sat, Sep 2 2017 6:23 PM
Advertisement