గుర్గావ్‌ బాలుడి హత్యపై సీబీఎస్‌ఈ కమిటీ | CBSE Committee on the murder of Gurgaon boy | Sakshi
Sakshi News home page

గుర్గావ్‌ బాలుడి హత్యపై సీబీఎస్‌ఈ కమిటీ

Published Sun, Sep 10 2017 3:55 AM | Last Updated on Tue, Sep 19 2017 1:40 PM

CBSE Committee on the murder of Gurgaon boy

న్యూఢిల్లీ :  గుర్గావ్‌లోని ర్యాన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్లో రెండో తరగతి విద్యార్థి ప్రద్యుమన్‌ ఠాకూర్‌(7) దారుణ హత్యపై విచారణ కమిటీని నియమించినట్లు సీబీఎస్‌ఈ తెలిపింది. ప్రీత్‌విహార్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్‌ అరుణ్‌కుమార్, డిప్యూటీ కమిషనర్‌ కైలాశ్‌తో నియమించిన కమిటీ 30 రోజుల్లోగా నివేదిక సమర్పిస్తుందని సీబీఎస్‌ఈ ఉన్నతాధికారి చెప్పారు. బాలుడి మృతికి బాధ్యునిగా చేస్తూ పాఠశాల తాత్కాలిక ప్రిన్సిపల్‌ను సస్పెండ్‌ చేయడంతో పాటు మొత్తం భద్రతా సిబ్బందిని విధుల నుంచి తొలగించినట్లు జిల్లా ప్రజా సంబంధాల అధికారి తెలిపారు.  కేసు విచారణను 7 రోజుల్లోగా పూర్తి చేస్తామని గుర్గావ్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement