సీబీఎస్‌ఈ మార్గదర్శకాలు జారీ
న్యూఢిల్లీ: పాఠశాలల్లో విద్యార్థుల భద్రతకు సంబంధించి సీబీఎస్‌ఈ గురువారం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. బోధన, బోధనేతర సిబ్బందికి సైకోమెట్రిక్ పరీక్షలు(మానసిక స్థితిని నిర్ధారించే) నిర్వహించాలని తన అనుబంధ పాఠశాలలను ఆదేశించింది. ఈ ప్రక్రియను రెండు నెలల్లోగా పూర్తిచేయాలని కోరింది. తమ ఈ మార్గదర్శకాలను పాటించాలని, లేని పక్షంలో పాఠశాలల గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించింది.
ఇటీవల గుర్గావ్, ఢిల్లీలోని పాఠశాలల్లో విద్యార్థులపై లైంగిక దాడులు జరిగిన నేపథ్యంలో బోర్డు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. ‘బస్సు డ్రైవర్లు, ప్యూన్, ఇతర సిబ్బందికి సైకోమెట్రిక్ పరీక్షలు నిర్వహించి, ఆ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో బోర్డుకి పంపించాలి’ అని సీబీఎస్‌ఈ పాఠశాలలకు పంపిన సర్క్యులర్‌లో పేర్కొంది. పాఠశాలల పరిసరాల్లో భద్రతా తనిఖీలు, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, పోలీస్‌లతో వెరిఫికేషన్లు, తల్లిదండ్రులు–ఉపాధ్యాయులతో కూడిన కమిటీల నియామకం, తరచూ తల్లిదండ్రులతో మాట్లాడటం లాంటి చర్యలనూ చేపట్టాలని సూచించింది.
స్కూలు సిబ్బందికి సైకోమెట్రిక్ పరీక్షలు
Published Fri, Sep 15 2017 1:39 AM | Last Updated on Fri, Nov 9 2018 4:59 PM
Advertisement
Advertisement