హైదరాబాద్ : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ బుధవారం మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని మరికల్, జడ్చర్ల జాతీయ రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. పర్యటన నిమిత్తం రాష్ట్రానికి విచ్చేసిన కేంద్ర మంత్రితో తెలంగాణ రవాణాశాఖ మంత్రి పి.మహేందర్ రెడ్డి భేటీ కానున్నారు. ఆర్టీసీ విభజన అంశంపై కేంద్ర మంత్రితో చర్చించనున్నారు.