‘కేంద్ర’ పెన్షనర్లకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి | 'Central' to pensioners Aadhaar mandatory integration | Sakshi
Sakshi News home page

‘కేంద్ర’ పెన్షనర్లకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి

Published Tue, Apr 7 2015 1:15 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

'Central' to pensioners Aadhaar mandatory integration

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ పొందడంలో ఉన్న సమస్యలు అధిగమించేందుకు బ్యాంకుల్లో తప్పనిసరిగా ఆధార్ నంబర్ నమోదు చేసుకోవాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్ల శాఖ ఆదేశాలు జారీ చేసింది. పెన్షనర్లు  పెన్షన్లు పొందేందుకు ఆధార్ నంబర్ నమోదు చేసుకోవాలని అందులో పేర్కొంది.

జీవించి ఉన్నట్లు ధ్రువపత్రమిచ్చే సమయంలో సమస్యలు తలెత్తకుండా ముందుగానే ఈ ప్రక్రియ పూర్తి చేయాలంది. పెన్షనర్లకు సులువుగా పెన్షన్లు చెల్లించేందుకు కేంద్రం ఈ ప్రక్రియ ప్రారంభించిందని పేర్కొంది. ఆధార్ అనుసంధానిత బయోమెట్రిక్ వెరిఫికేషన్ వ్యవస్థ ‘జీవన్ ప్రమాణ్’ను గతేడాది నవంబర్‌లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు సర్టిఫికెట్ సమర్పించేందుకు బ్యాంకుల చుట్టూ తిరగకుండా ఉండేందుకు ఈ ప్రక్రియ దోహదపడనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement