కరువు జిల్లాలకు 410 కోట్లు | Centre allocates Rs 410-crore for drought affected districts | Sakshi
Sakshi News home page

కరువు జిల్లాలకు 410 కోట్లు

Published Wed, Sep 2 2015 1:31 AM | Last Updated on Sun, Sep 3 2017 8:33 AM

Centre allocates Rs 410-crore for drought affected districts

 తెలంగాణకు రూ. 13.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ. 16.89 కోట్లు
 సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో వర్షాల్లేక కరువు బారినపడుతున్న జిల్లాలు, భూగర్భ జలాలు అడుగంటిన ప్రాంతాలకు ఆర్థిక సాయం అందించాలని కేంద్రం నిర్ణయించింది.  20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని కరువు పీడిత జిల్లాలకు మంగళవారం ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన కింద రూ. 410 కోట్లను కేటాయించింది. తెలంగాణకు రూ. 13.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ. 16.89 కోట్లు కేటాయించారు. కరువు ప్రభావం తగ్గింపు, చిన్న నీటి నిల్వల సంరక్షణ తదితరాలకు ఈ మొత్తాన్ని వినియోగిస్తారు.

అలాగే, రూ. 69 కోట్లను రాజస్తాన్‌కు, రూ. 64.42 కోట్లను తమిళనాడుకు, రూ. 46.36 కోట్లను పంజాబ్‌కు, రూ. 40.96 కోట్లను కర్ణాటకకు కేటాయించారు. దేశవ్యాప్తంగా 1071 బ్లాకులు/తాలూకాల్లో భూగర్భ జలాలు అడుగంటి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయని భూగర్భ జలాల బోర్డు నిర్ధారించింది. దాదాపు 150 బ్లాకులు/తాలూకాల్లో భూగర్భ జల వాడకాన్ని నియంత్రించాల్సిన అవసరాన్ని గుర్తించింది. దేశంలో 219 జిల్లాలు తరచుగా కరువు బారిన పడుతున్నాయని కేంద్రం గుర్తించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement