
చైనా నేవీలో కొత్త ఆయుధం
బీజింగ్ : చైనా నేవీ మరింత బలోపేతం అయింది. ఇప్పటికే పలు యుద్ధవాహక నౌకలు ఉన్న చైనా నేవీలో గురువారం.. న్యూక్లియర్ సబ్ మెరైన్ చేరింది. ఇప్పటివరకూ ఉన్న సబ్ మెరైన్లలో ఇదే అత్యాధునికమైనదనే చైనా మీడియా అధికారికంగా ప్రకటించింది. తాజాగా చేరిన కొత్త సబ్ మెరైన్‌తో చైనా న్యూక్లియర్ సబ్‌మెరైన్ల సంఖ్య 69కి చేరిందని అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు అంచనా వస్తున్నారు.
అత్యాధునిక న్యూక్లియర్ సబ్ మెరైన్‌ను డలియన్ షిప్ యార్డులో చైనా షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ సబ్‌మెరైన్కు సంబంధించిన పేరు, వివరాలను ఇప్పటివరకూ విడుదల చేయలేదు. అయితే దీనిని టైప్-096 సబ్ మెరైన్‌గా నిపుణులు భావిస్తున్నారు.