సీఐఎస్‌ఎఫ్‌లో కరోనా కలకలం | CISF Jawan Dies Due To Coronavirus | Sakshi
Sakshi News home page

సీఐఎస్‌ఎఫ్‌ జవాన్‌ మృతి

Published Fri, May 29 2020 2:47 PM | Last Updated on Fri, May 29 2020 2:48 PM

CISF Jawan Dies Due To Coronavirus   - Sakshi

కోల్‌కతా : కరోనా వైరస్‌ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళానికి (సీఐఎస్‌ఎఫ్) చెందిన ఓ జవాన్‌ శుక్రవారం మరణించారు. మరణించిన జవాన్‌ను కోల్‌కతాకు చెందిన జీఆర్‌ఎస్‌ఈఎల్‌ యూనిట్‌కు చెందిన సుశాంత్‌ కుమార్‌ ఘోష్‌గా గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. కోవిడ్‌-19తో కోల్‌కతాలో ఇప్పటివరకూ ముగ్గురు సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది మరణించారు.

ఇక ఈ నెల ఆరంభంలో నగరంలోని సీఐఎస్‌ఎఫ్‌ అసిస్టెంట్‌ ఎస్‌ఐ (55) కోవిడ్‌-19 సోకి మరణించారు.  అంతకుముందు కోల్‌కతాలోని ఇండియన్‌ మ్యూజియం వద్ద విధుల్లో ఉన్న సీఐఎస్‌ఎఫ్‌ ఏఎస్‌ఐ ఒకరు కరోనా మహమ్మారితో మృత్యువాత పడ్డారు.

చదవండి : కరోనా మరణాల్లో చైనాను దాటిన భారత్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement