సీఎం కాన్వాయ్‌లో కారు బోల్తా | CM BS Yediyurappa Kanvai Roll Over on Flyover in Karnataka | Sakshi
Sakshi News home page

సీఎం కాన్వాయ్‌లో కారు బోల్తా

Published Wed, Jan 1 2020 8:01 AM | Last Updated on Wed, Jan 1 2020 8:01 AM

CM BS Yediyurappa Kanvai Roll Over on Flyover in Karnataka - Sakshi

దెబ్బతిన్న ఇన్నోవా కారు

సాక్షి, బెంగళూరు: ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప కాన్వాయ్‌లో ఒక వాహనం బోల్తా పడగా డ్రైవర్‌ గాయపడ్డాడు. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో సీఎం యడి యూరప్ప, ఆయన కార్యదర్శి సెల్వకుమార్‌ తుమకూరు బయలుదేరారు. సీఎం యడియూరప్పతో పాటు సెల్వకుమార్‌ ఒకే కారులో కూర్చున్నారు. సెల్వకుమార్‌కు చెందిన ఇన్నోవా కారు వారి వెనుక ఖాళీగా వస్తోంది. యశవంతపుర ఉపరితల వంతెనపై అతివేగంతో వచ్చి అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని అవతలి వైపు రోడ్డులో వెళ్తున్న క్యాంటర్, ఆటోను ఢీకొంది. ప్రమాదంలో ఇన్నోవా డ్రైవర్‌ వినయ్‌తో పాటు ఇతర వాహనాల్లో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇన్నోవా ముందుభాగం నుజ్జునుజ్జయింది. ఎయిర్‌బ్యాగు తెరచుకోవడంతో డ్రైవర్‌ గాయాలతో బయటపడ్డాడు. అయితే అతి వేగం కారణంగానే వాహనం అదుపు తప్పి బోల్తా పడిందని పోలీసులు తెలిపారు. సీఎం యథావిధిగా తుమకూరు వెళ్లిపోయారు. ప్రమాదంతో అరగంట పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 

ఫ్లై ఓవర్‌పై స్తంభించిన ట్రాఫిక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement