కొలీజియానికి న్యాయబద్ధత లేదు: కేంద్రం | collegium system is not good pattern, says central government | Sakshi
Sakshi News home page

కొలీజియానికి న్యాయబద్ధత లేదు: కేంద్రం

Published Thu, Mar 19 2015 3:38 AM | Last Updated on Sun, Sep 2 2018 5:18 PM

collegium system is not good pattern, says central government

న్యూఢిల్లీ: జడ్జీలను జడ్జీలే నియమించే  పాత కొలీజియం వ్యవస్థ న్యాయబద్ధమైనది కాదని కేంద్రం బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. కొలీజియంలో లోపాలున్నాయని, దానిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నుంచే విమర్శలు వచ్చాయంది. న్యాయమూర్తుల నియామక జాతీయ కమిషన్ చట్టం చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ముందు కేంద్రం వాదనలు వినిపించింది. నూతన వ్యవస్థలో న్యాయవ్యవస్థ నుం చి ముగ్గురు న్యాయమూర్తులు, పౌరసమాజం నుంచి ఇద్దరు సభ్యులుగా ఉంటారని, జడ్జిల నియామకానికి ఇది ఆరోగ్యకరమైన విధానమని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement