గూగుల్‌కు రూ. కోటి జరిమానా | Competition Commission slaps Rs 1 crore fine on Google | Sakshi
Sakshi News home page

గూగుల్‌కు రూ. కోటి జరిమానా

Published Fri, Mar 28 2014 2:57 AM | Last Updated on Sat, Sep 2 2017 5:15 AM

Competition Commission slaps Rs 1 crore fine on Google

న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కంపెనీపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొరడా ఝళిపించింది. భారత్‌లో అనుచిత వాణిజ్య విధానాలను అనుసరించడంపై చేపట్టిన దర్యాప్తునకు అవసరమైన సమాచారం ఇవ్వకపోవడంతో ఆ కంపెనీపై రూ. కోటి జరిమానా విధించింది.

 

సీసీఐ డెరైక్టర్ జనరల్ కోరిన సమాచారం ఇవ్వకుండా దర్యాప్తునకు సహకరించనందుకే కమిషన్ ఈ జరిమానా విధించిందని, ఇకపై సహకరించాలని ఆదేశించిందని ఈ మేరకు గురువారం అధికారిక వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement