మమతమ్మా.. ఇక చాలు దిగిపో!
శారదా చిట్ఫండ్స్ కేసులో ఆరోపణలు రావడంతో.. ఇక ముఖ్యమంత్రి పదవికి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధిర్ చౌధురి డిమాండ్ చేశారు. ఐఆర్సీటీసీ కాంట్రాక్టు పొందడానికి శారదా గ్రూపునకు మమత అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. ఆ సమయానికి రైల్వే మంత్రిత్వ శాఖ తృణమూల్ కాంగ్రెస్ చేతుల్లోనే ఉంది. కొన్నాళ్ల పాటు స్వయంగా మమతా బెనర్జీయే రైల్వే మంత్రిగా కూడా పనిచేశారు.
ఈ కాంట్రాక్టు వ్యవహారంపై సీబీఐ ఆమెను కూడా విచారించాల్సిందేనని చౌధురి డిమాండ్ చేశారు. ఈ కేసులో దర్యాప్తు సజావుగా సాగేందుకు వీలుగా మమత తన పదవి నుంచి తప్పుకోవాలని ఆయన అన్నారు. ఆమెకు నిజంగానే నీతి, నిజాయితీలు ఉంటే.. రాజీనామా చేయాలన్నారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు మాత్రం మమతా బెనర్జీ మీద వచ్చిన ఆరోపణలను ఖండించాయి.