కోపంతో కమిషనర్‌పై చేప విసిరికొట్టిన ఎమ్మెల్యే | Congress MLA Loses Cool, Flings Fish At fisheries commissioner | Sakshi
Sakshi News home page

కోపంతో కమిషనర్‌పై చేప విసిరికొట్టిన ఎమ్మెల్యే

Published Fri, Jul 7 2017 3:21 PM | Last Updated on Tue, Sep 5 2017 3:28 PM

కోపంతో కమిషనర్‌పై చేప విసిరికొట్టిన ఎమ్మెల్యే

కోపంతో కమిషనర్‌పై చేప విసిరికొట్టిన ఎమ్మెల్యే

ముంబయి: ముంబయిలో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఒకరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్యశాఖకు చెందిన కమిషనర్‌తో మాట్లాడుతూ కోపాన్ని ఆపుకోలేక అక్కడే ఉన్న ఓ చేపను విసిరి కొట్టాడు. ఆయనపై చేయి కూడా చేసుకోబోయి ఊగిపోయాడు. గురువారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్‌ ఇంట్లో అడుగుపెట్టి తెగ వైరల్‌ అయింది. తమ సమస్యలకు పరిష్కారం చూపించాలని పలువురు మత్స్యకారులు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే నితేష్‌ రాణేను కలిశారు. ఈ సందర్భంగా సిందుబర్గ్‌ ప్రాంతానికి చెందిన మత్స్యశాఖ కమిషనర్‌తో తన కార్యాలయంలో సమావేశం అయ్యారు.

ఈ సమావేశంలో మత్స్యకారులు, ఇతరులు కూడా చాలా మంది పాల్గొన్నారు. ఈ క్రమంలో ఉన్నట్లుండి సహనాన్ని కోల్పోయిన ఎమ్మెల్యే అక్కడే వారి మధ్య చేపలబుట్టలో ఉన్న ఒక చేపను తీసుకొని ఆగ్రహంతో విసిరి కొట్టారు. ఈ విషయం రాద్ధాంతం కావడంతో మీడియా ప్రశ్నించగా గతంలోనే మత్స్యకారుల సమస్యలను కమిషనర్‌ వద్దకు తీసుకెళ్లామని, అయినా ఆయన స్పందించలేదని, ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాధికారులను ఏ విధంగా భరించాలంటూ ఆయన మీడియాను ప్రశ్నించారు. మరబోటులతో చేపల వేటకు వెళ్లే వారి వల్ల సంప్రదాయ పద్దతుల్లో చేపలుపట్టే వారికి తీవ్ర నష్టం జరుగుతుందని, ఈ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ఓ ప్రభుత్వాధికారిగా ఆయన తీసుకోవాలంటూ గుర్తు చేశారు. నితేష్‌ రాణే మాజీ ముఖ్యమంత్రి నారాయణ్‌ రాణే కుమారుడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement