ఢిల్లీ: న్యూఢిల్లీలో ఈ మధ్య జరుగుతున్న ఘటనలు తమను ఆందోళనలకు గురిచేస్తున్నాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్.ఎస్.ఎస్, బీజేపీ విధానాలు బాధాకరమన్నారు. అఫ్జల్ గురు వంటి దేశ ద్రోహులను కాంగ్రెస్ ఎన్నడూ సమర్ధించదని చెప్పారు. శుక్రవారం న్యూఢిల్లీలో మీడియాతో ఉత్తమ్ మాట్లాడారు. కశ్మీర్ లో పీ.డీ.పి తో కలిసి బీజేపీ పార్టీ పనిచేస్తుందని తెలిపారు. అయితే అఫ్జల్ గురు ను సమర్ధించిన పార్టీ పీ.డీ.పి.. బీజేపీ అధికారం లోకి వచ్చిన తర్వాత యూనివర్సిటీస్ లో వాతావరణం చెడిపోయిందని విమర్శించారు. కన్నయ్య కుమార్ పై దేశ ద్రోహం కేసు పెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని ఉత్తమ్ అన్నారు. పటియాల కోర్ట్ ఘటన ప్రజాస్వామ్యానికి మచ్చ' అని అన్నారు. పటియాల కోర్టు వద్ద పోలీస్లు ప్రేక్షక పాత్ర వహించారని దుయ్యబట్టారు.
బీజేపీ, ఆర్.ఎస్.ఎస్ భావజాలాన్ని వ్యతిరేకించే వారిని అనగద్రొక్కటం సరికాదన్నారు. దేశానికి స్వాతంత్రం తెచ్చిన ఇందిరా గాంధీ కుటుంబంపై విమర్శలు సరికాదు అని చెప్పారు. కన్నయ్య కుమార్ ఫై పెట్టిన కేసు విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత దానం నాగేందర్ రాజీనామా విషయం దిగ్విజయ్ తో చర్చించామని తెలిపారు. వరంగల్, ఖమ్మం ఎన్నిక వ్యవహారం లోకల్ లీడర్స్ చూస్తున్నారనీ, అభ్యర్థుల ఎంపిక స్థానిక నాయకత్వం ఆద్వర్యం లో జరుగుతుందని ఉత్తమ్ చెప్పారు.
'ఆ దేశ ద్రోహులను కాంగ్రెస్ సమర్ధించదు'
Published Fri, Feb 19 2016 3:37 PM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM
Advertisement