త్వరలో.. నేషనల్ హెరాల్డ్ పునఃప్రారంభం | Congress to relaunch National Herald | Sakshi
Sakshi News home page

త్వరలో.. నేషనల్ హెరాల్డ్ పునఃప్రారంభం

Published Wed, Aug 31 2016 10:02 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

త్వరలో.. నేషనల్ హెరాల్డ్ పునఃప్రారంభం - Sakshi

త్వరలో.. నేషనల్ హెరాల్డ్ పునఃప్రారంభం

న్యూఢిల్లీ: ‘నేషనల్ హెరాల్డ్’, ‘నవజీవన్’ పత్రికలు మళ్లీ పాఠకుల ముందుకు రానున్నాయి. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఈ పత్రికలను మళ్లీ ప్రచురించనున్నట్లు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్(ఐఎన్‌సీ) బుధవారం అధికారికంగా ప్రకటించింది. సీనియర్ జర్నలిస్టు నీలభ్ మిశ్రాను ఎడిటర్ ఇన్ చీఫ్‌గా నియమించారు. ఇంగ్లిష్, హిందీ భాషల్లో పత్రికలను ప్రచురించనున్నారు.

ఆర్థిక కారణాల వల్ల ఈ పత్రికల ప్రచురణను గతంలో నిలిపివేశారు. అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్‌ను 1937లో జవహర్‌లాల్ నెహ్రూ స్థాపించారు. తాజాగా నీలభ్‌మిశ్రా సారథ్యంలో ఈ పత్రికలు, డిజిటల్ ఎడిషన్‌‌సతో సహా ప్రజల ముందుకు రానున్నాయి. మిశ్రా తన సంపాదక బృందాన్ని నియమించుకుని త్వరలోనే పని ప్రారంభిస్తారని, ఆ తర్వాత ఉర్దూ పత్రిక ఖ్వామీ ఆవాజ్ కూడా వెలువడుతుందని సదరు ప్రకటనలో పేర్కొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement