ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ లో భారీ కుట్ర?
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ లో భారీ కుట్ర జరుగుతుందా? కొన్ని కంపెనీలు తమ పరిధికి మించి ఎక్కువగా బ్యాండ్ విడ్త్ ను వినియోగించుకుంటున్నాయా? అంటే తాజాగా చోటు చేసుకున్న పలు ఆరోపణలు అందుకు బలాన్ని ఇస్తున్నాయి. ఒక సైట్ ఓపెన్ కావాలంటే ఎక్కువ సేపు.. మరో సైట్ మాత్రం క్షణాల్లో ఓపెన్ కావడం అనే ఆరోపణలపై వివాదం రాజుకుంది. ఇండియాలో అతి పెద్ద ఆన్ లైన్ స్టోర్ ఫ్లిప్ కార్ట్ సైట్ ఓపెన్ కావడానికి ఆ వెబ్ సైట్ యాజమాన్యం ఎయిర్ టెల్ సాయం తీసుకుంటున్నారనేది ప్రధాన ఆరోపణ.
ప్రస్తుతం ఎయిర్ టెల్ పథకం ప్రవేశపెట్టిన భారతీ ఎయిర్ టెల్ పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇంటర్నెట్.ఆర్గ్(ఫేస్ బుక్), రిలయన్స్ కమ్యూనికేషన్స్ పైనా ట్రాయ్ కు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో అధ్యయన కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. భారీ విమర్శలతో ఫ్లిప్ కార్డ్ వెనక్కి తగ్గి, ఎయిర్ టెల్ జీరో నుంచి విత్ డ్రా అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా నెట్ న్యూట్రాలిటీకి పలువురు ప్రముఖులు మద్దతు తెలిపారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇందుకు మద్దతు తెలిపారు.