internet bandwidth
-
సగానికిపైగా వినియోగదారులకు ఇంటర్నెట్ కష్టాలు!
జాతీయ స్థాయిలో ఇంటర్నెట్ సరఫరాకు సంబంధించి గత ఆరు నెలలుగా వందలాది ఫిర్యాదులు నమోదయ్యాయి. బ్రాడ్‌బ్యాండ్, ఫైబర్, డీఎస్ఎల్ సేవలపై కొన్ని సంస్థలు ఇంటర్నెట్ అంతరాయంపై సర్వే నిర్వహించాయి. ఇంటర్నెట్ సేవలు అందించే కంపెనీలు దాదాపు రూ.75వేల కోట్లతో వినియోగదారులకు సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెబుతున్నాయి. అయినప్పటికీ కనెక్టివిటీ కష్టాలు మాత్రం తప్పడం లేదు. నిరంతరం ఇంటర్నెట్ సరఫరాలో తీవ్ర అంతరాయంతో ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో 56శాతం మంది నెట్ కనెక్షన్లో అంతరాయం వల్ల ఇబ్బందిపడుతూ సంబంధిత సంస్థలకు ఫిర్యాదు చేస్తున్నారు. కంపెనీలు ముందుగా వాగ్ధానం చేసిన వేగం కంటే నెట్ తక్కువ వేగంతో వస్తుందని ఫిర్యాదులో తెలిపారు. వీరిలో 21శాతం మంది ప్రతి నెలా మూడుసార్లకు పైగా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దేశం అంతటా 303 జిల్లాల నుంచి 51,000 మందితో ఈ సర్వే నిర్వహించారు. ఇందులో 67శాతం పురుషులు, 33శాతం మహిళలు ఉన్నారు. 46శాతం మంది వినియోగదారులు తమ ఫిర్యాదులను పరిష్కరించడానికి సర్వీస్ ప్రొవైడర్లు 24 గంటల కంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నారని తెలిపారు. ఇదీ చదవండి: డేటా సెంటర్లలోకి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రిమోట్ వర్క్, వర్క్‌ఫ్రంహోం, ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్ వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని నివేదిక చెబుతుంది. 70శాతం మంది యూజర్లు ఇంటర్నెట్ సరఫరాలో మెరుగైన సేవలందించే ఇతర సర్వీస్ ప్రొవైడర్‌కు మారడానికి ఆసక్తిగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది. కొన్ని సర్వేల నివేదికల ప్రకారం దేశంలో ఇంటర్నెట్ వినియోగించే సరళి ఈ కింది విధంగా ఉంది. * ఇంటర్నెట్ వ్యాప్తి 2012లో దేశవ్యాప్తంగా 12.6 శాతం నుంచి 2022 నాటికి 48.7 శాతానికి పెరిగింది. * ప్రపంచ వ్యాప్తంగా 692 మిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారులతో భారత్ రెండో స్థానంలో ఉంది. * గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ కేంద్రాల్లో ఇంటర్నెట్ కనెక్షన్లు ఎక్కువ. * తక్కువ ధరలకే ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నప్పటికీ..పేదరికం, అవగాహన లేకపోవడం, స్పష్టమైన లింగ వ్యత్యాసం వంటి కారణాల వల్ల దేశంలో ఇంటర్నెట్ వినియోగం ఇంకా ఆశించినమేర ఉండడం లేదు. * 2028 నాటికి 244 మిలియన్ కుటుంబాలు ఇంటర్నెట్ వినియోగిస్తాయని అంచనా. * 2020 నాటికి దేశంలో 622 మిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. అయితే ఈ సంఖ్య వచ్చే ఐదేళ్లలో దాదాపు 45 శాతం పెరుగుతుందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ సంఖ్య 2025 నాటికి 900 మిలియన్లకు చేరుకోనుంది. -
నెలకు రూ. 500లోపు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్
ముంబై, సాక్షి: నెలకు రూ. 500 లోపు ఖర్చులో నెట్ కనెక్షన్ తీసుకుందామనుకునే వినియోగదారులకు శుభవార్త. పలు కంపెనీలు రూ. 500లోపు అద్దెలో బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ అందించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. జాబితాలో ఎయిర్టెల్, రిలయన్స్ జియోతోపాటు.. ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్, ఎగ్జైటెల్ చేరాయి. పలు ఆఫర్లు రూ. 399తోనే ప్రారంభంకానున్నాయి. చదవండి: (బంగారు హెడ్‌ఫోన్స్ @ రూ. 80 లక్షలు) పలు ఆఫర్లు ఈ ఏడాది(2020) టెలికం కంపెనీలు బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులకు సంబంధించి పలు ఆఫర్లు ప్రకటించాయి. పీఎస్‌యూ సంస్థ బీఎస్ఎన్ఎల్ ప్రమోషనల్ సమయంలో డేటా పెంచడం వంటి ఆఫర్లు ప్రకటించగా.. జియో ఫైబర్ రూ. 399 నుంచి ప్రారంభమయ్యే సర్వీసులకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని సమకూర్చింది. ఇక ఎగ్జైటెల్ కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాలలో డేటా పరిమితిలేని ప్యాకేజీలు ప్రకటించింది. నెలకు రూ. 500లోపు చెల్లించే బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ల వివరాలివి.. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్: నెలకు రూ. 499 ధరలో అన్లిమిటెడ్ బ్రాండ్‌బ్యాండ్ ప్లాన్ ఇది. 40 ఎంబీపీఎస్ స్పీడ్వరకూ లభించే ఈ ప్లాన్‌లో భాగంగా పరిమితిలేని ఇంటర్నెట్ను అందిస్తోంది. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్కు సబ్స్క్రిన్సన్, వింక్ మ్యూజిక్, షా అకాడమీ తదితర సౌకర్యాలు సైతం లభిస్తున్నాయి. ఎక్స్ట్రీమ్ యాప్ ద్వారా వూట్ బేసిక్, ఈరోస్ నౌ, హాంగామా ప్లే, షెమారూ ఎం, అల్ట్రాను పొందవచ్చు. చదవండి: (హీరో ఈసైకిల్@ 49,000) బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్: 100 జీబీ సీయూఎల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను రూ. 499 ధరలో అందిస్తోంది. నెలకు 100 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. నెలవారీ జీబీ తదుపరి 50 ఎంబీపీఎస్ బ్యాండ్‌విడ్త్‌లో 2 ఎంబీపీఎస్‌కు స్పీడ్ తగ్గనుంది. జియోఫైబర్ రూ. 399 బ్రాడ్‌బ్యాండ్: ఈ పథకంలో భాగంగా 30 ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్లిమిటెడ్ ఇంటర్నెట్ను అందిస్తోంది. ఈ పథకంలో ఎలాంటి ఓటీటీ సబ్స్క్రిప్షన్లనూ కంపెనీ ఆఫర్ చేయడంలేదు. అయితే అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఎగ్జైటెల్ రూ. 399 బ్రాడ్‌బ్యాండ్: ఈ పథకంలో భాగంగా వినియోగదారులు ఏడాది కాలానికి సబ్‌స్ర్కయిబ్ చేస్తే.. 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్లిమిటెడ్ ఇంటర్నెట్ను అందిస్తోంది. ఇందుకు ఒకేసారి రూ. 4,788ను చెల్లించవలసి ఉంటుంది. అంతేకాకుండా హోమ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్స్‌లో భాగంగా (నెలకు రూ. 449 అద్దె) ఏడాదికి రూ. 5,388, లేదా (రూ. 499 అద్దె) రూ. 5,988 ఒకేసారి చెల్లిస్తే 200 ఎంబీపీఎస్ లేదా 300ఎంబీపీఎస్ స్సీడ్‌తో సర్వీసులు అందించనుంది. ఇలా కాకుండా 9 నెలలకే కావాలనుకుంటే 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో రూ. 424 చొప్పున ఒకేసారి చెల్లించవలసి ఉంటుంది. ఇదే ఆఫర్లో 6 నెలల కోసం రూ. 490 చొప్పున ఒకేసారి చెల్లించవలసి ఉంటుంది. -
బంగ్లాదేశ్‌కు మన విద్యుత్
♦ బదులుగా భారత్‌కు ఇంటర్నెట్ బ్యాండ్‌విడ్త్ ♦ ఈ ఒప్పందం చరిత్రాత్మకం: మోదీ న్యూఢిల్లీ/అగర్తలా: బంగ్లాదేశ్, భారత్ ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యే దిశగా మరో ముందడుగు పడింది. బుధవారం నుంచి బంగ్లాదేశ్‌కు భారత్ 100 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయడం ప్రారంభించింది. బదులుగా ఆ దేశం 10 జీబీపీఎస్ ఇంటర్నెట్ బ్యాండ్‌విడ్త్‌ను అందించనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లా ప్రధాని షేక్ హసీనా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీనిని ప్రారంభించారు. ఈ ఒప్పందం చరిత్రాత్మకమని, ఈశాన్య రాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉంటుం దని మోదీ అభివర్ణించారు. ఇరు దేశాలు ప్రగతి పథంలో సాగేందుకు ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయనున్నట్లు చెప్పారు. ‘ఇప్పటికే మనకు పశ్చిమ, దక్షిణ ఇంటర్నెట్ గేట్వేలు ఉన్నాయి. ఇప్పుడు తూర్పున కూడా ప్రధానమైన ఇంటర్నెట్ గేట్‌వే ఏర్పడింది’ అని అన్నారు. బంగ్లాతో ఏర్పడిన ఈ ఈశాన్య గేట్‌వే అస్సాం, త్రిపుర, సిక్కిం రాష్ట్రాలకు కనెక్టివిటీని ఏర్పరచిందన్నారు. భవిష్యత్‌లో అంతరిక్ష పరిశోధనల్లోనూ ఇరు దేశాలు భాగస్వామ్యం కావాలన్నారు. ఒప్పందం సంబంధాలను పెంపొందించిందని, పలు రంగాల్లో కలసి సాగాలని అభిలషిస్తున్నానని హసీనా అన్నారు. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండి యా వేసిన 400కేవీడీసీ లైన్ల ద్వారా త్రిపుర నుంచి విద్యుత్‌ను సరఫరా చేయనున్నారు. 2 నెలల్లో ఫిర్యాదులను పరిష్కరించాలి! ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలని వివిధ శాఖల ఉన్నతాధికారులకు ప్రధాని మోదీ సూచించారు. ఫిర్యాదులు లేదా వినతులు అందిన 60 రోజుల్లోగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నెలలోపు ఆ విధానం అమల్లోకి రావాలన్నారు. ఫిర్యాదుల పరిష్కారం ప్రజాస్వామ్యంలో కీలకమన్నారు. సాధ్యమైనంత త్వరగా అన్ని భూ రికార్డులను ఆధార్‌తో అనుసంధానించాలని సూచించారు. కంప్యూటర్ ఆధారిత ‘ప్రగతి’ వేదిక ద్వారా బుధవారం వారితో ప్రధాని సంభాషించారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో కొనసాగుతున్న రైల్వేస్, విద్యుత్, చమురు రంగాల్లోని మౌలిక వసతుల ప్రాజెక్టుల పురోగతిని ప్రధాని సమీక్షించారు. -
ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ లో భారీ కుట్ర?
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ లో భారీ కుట్ర జరుగుతుందా? కొన్ని కంపెనీలు తమ పరిధికి మించి ఎక్కువగా బ్యాండ్ విడ్త్ ను వినియోగించుకుంటున్నాయా? అంటే తాజాగా చోటు చేసుకున్న పలు ఆరోపణలు అందుకు బలాన్ని ఇస్తున్నాయి. ఒక సైట్ ఓపెన్ కావాలంటే ఎక్కువ సేపు.. మరో సైట్ మాత్రం క్షణాల్లో ఓపెన్ కావడం అనే ఆరోపణలపై వివాదం రాజుకుంది. ఇండియాలో అతి పెద్ద ఆన్ లైన్ స్టోర్ ఫ్లిప్ కార్ట్ సైట్ ఓపెన్ కావడానికి ఆ వెబ్ సైట్ యాజమాన్యం ఎయిర్ టెల్ సాయం తీసుకుంటున్నారనేది ప్రధాన ఆరోపణ. ప్రస్తుతం ఎయిర్ టెల్ పథకం ప్రవేశపెట్టిన భారతీ ఎయిర్ టెల్ పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇంటర్నెట్.ఆర్గ్(ఫేస్ బుక్), రిలయన్స్ కమ్యూనికేషన్స్ పైనా ట్రాయ్ కు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో అధ్యయన కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. భారీ విమర్శలతో ఫ్లిప్ కార్డ్ వెనక్కి తగ్గి, ఎయిర్ టెల్ జీరో నుంచి విత్ డ్రా అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా నెట్ న్యూట్రాలిటీకి పలువురు ప్రముఖులు మద్దతు తెలిపారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇందుకు మద్దతు తెలిపారు.