న్యూఢిల్లీ: ‘పారిశ్రామిక వివాదాల చట్టం–1947’ ప్రకారం పరిశ్రమ (ఇండస్ట్రీ) అనే పదానికి సరైన నిర్వచనం ఏంటో తేల్చే పనిని 9 మంది సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేస్తూ ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలిచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం..‘బాగా చిక్కుముడులతో కూడిన ఈ అంశాన్ని 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనానికి బదిలీ చేస్తున్నాం.
ఆ ధర్మాసనాన్ని త్వరలోనే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటు చేస్తారు’అని పేర్కొంది. 1978 నుంచి పరిశ్రమ అనే పదానికి నిర్వచనంపై వివాదం నడుస్తోంది. 1978లో ఏడుగురు సభ్యుల ధర్మాసనం, 1996, 2001ల్లో త్రిసభ్య ధర్మాసనాలు, 2005లో ఐదుగురు సభ్యుల ధర్మాసనం, తాజగా ఏడుగురు సభ్యుల ధర్మాసనం..ఇలా ఈ కేసును ఇప్పటికే పలు ధర్మాసనాలు విచారించాయి. తాజాగా 9 మంది సభ్యుల ధర్మాసనానికి ఇది చేరనుంది.
‘పరిశ్రమ’ నిర్వచనం చెప్పండి..
Published Wed, Jan 4 2017 1:00 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement
Advertisement