TS Thakur
-
డ్రగ్స్ మహమ్మారి సామాజిక రుగ్మత
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్ హైదరాబాద్: సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ వినియోగం ఓ సామాజిక రుగ్మతగా మారిందని, దీనిని రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ చేయి కలిపి పోరాడాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్ అన్నారు. ఇటీవల నగరాన్ని కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారంలో ఏ ఒక్క వర్గాన్నికానీ, వ్యక్తినికానీ లక్ష్యంగా చేసుకోలేదని, కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ సమస్యను పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ(టీసీఈఐ) ఆధ్వర్యంలో ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ ‘డ్రగ్ క్యాపిటల్’గా మారిందని కొన్ని వర్గాలు చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. డ్రగ్స్ వాడకందారులు, సరఫరాదారులు, రవాణాదారులు సహ డ్రగ్స్‌తో సంబంధం కలిగిన ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. డ్రగ్స్ దందాపై విచారణ చేస్తున్న అకున్ సబర్వాల్ అత్యంత సమర్థమైన అధికారి అని ప్రశంసించారు. అనంతరం డ్రగ్స్‌కు వ్యతిరేకంగా టీసీఈఐ నిర్వహించిన మోటార్‌బైక్ ర్యాలీని ఆయన జెండా ఉపి ప్రారంభించారు. సంస్థ కార్యదర్శి టీఎస్ ఠాకూర్ విలేకరులతో మాట్లాడుతూ ఈవెంట్ మేనేజ్మెంట్ రంగంలోని వివిధ విభాగాల సంస్థలు, వ్యక్తులను ప్రోత్సహించేందుకు టీసీఈఐ ఎక్సలెన్సీ అవార్డులు అందించనున్నట్లు తెలిపారు. ఈ నెల 25న హైటెక్స్‌లో నిర్వహించే అవార్డు ప్రదానోత్సవంలో పలువురు బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు సహ పలువురు సెలబ్రిటీలు పాల్గొంటారని తెలిపారు. ప్రస్తుతం ఈవెంట్ మేనేజ్మెంట్ రంగం దేశవ్యాప్తంగా ప్రతిఏటా 20 శాతం వృద్ధి సాధిస్తోందని, దేశవ్యాప్తంగా 2017లో రూ.6,500 కోట్ల వ్యాపారం నిర్వహించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్‌లో ఈ ఏడాది దాదాపు రూ. 600 కోట్ల వ్యాపారానికి అవకాశం ఉందన్నారు. -
సీజేఐగా జస్టిస్ ఖేహర్
న్యూఢిల్లీ: దేశ సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) 44వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ జగదీష్ సింగ్ ఖేహర్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాలులో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయనతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. 64 ఏళ్ల జస్టిస్ ఖేహర్ ఆంగ్లంలో దేవుని పేరిట ప్రమాణం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ పదవీ కాలం జనవరి మూడుతో ముగియడం తెలిసిందే. తన స్థానంలో సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ అయిన జస్టిస్ ఖేహర్ పేరును గత నెలలో జస్టిస్ ఠాకూర్ సిఫార్సు చేయడమూ విదితమే. దేశ చరిత్రలో సిక్కు వర్గానికి చెందిన వ్యక్తి సీజేఐగా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ఆగస్టు 27 వరకు జస్టిస్ ఖేహర్ సీజేఐగా కొనసాగుతారు. జస్టిస్ ఖేహర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోపాటు పలువురు కేంద్రమంత్రులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. పలు కీలక ధర్మాసనాల్లో.. జస్టిస్ ఖేహర్ సుప్రీంకోర్టులో కీలక తీర్పులు వెలువరించిన పలు ధర్మాసనాల్లో పాలుపంచుకున్నారు. జాతీయ జ్యుడీషియల్ నియామకాల కమిషన్(ఎన్‌జేఏసీ)ను రద్దు చేయడమేగాక.. అత్యున్నత న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తుల నియామకం కోసం కొలీజియం వ్యవస్థను పునరుద్ధరిస్తూ తీర్పు చెప్పిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి జస్టిస్ ఖేహర్ నేతృత్వం వహించడం తెలిసిందే. -
‘పరిశ్రమ’ నిర్వచనం చెప్పండి..
న్యూఢిల్లీ: ‘పారిశ్రామిక వివాదాల చట్టం–1947’ ప్రకారం పరిశ్రమ (ఇండస్ట్రీ) అనే పదానికి సరైన నిర్వచనం ఏంటో తేల్చే పనిని 9 మంది సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేస్తూ ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలిచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం..‘బాగా చిక్కుముడులతో కూడిన ఈ అంశాన్ని 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనానికి బదిలీ చేస్తున్నాం. ఆ ధర్మాసనాన్ని త్వరలోనే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటు చేస్తారు’అని పేర్కొంది. 1978 నుంచి పరిశ్రమ అనే పదానికి నిర్వచనంపై వివాదం నడుస్తోంది. 1978లో ఏడుగురు సభ్యుల ధర్మాసనం, 1996, 2001ల్లో త్రిసభ్య ధర్మాసనాలు, 2005లో ఐదుగురు సభ్యుల ధర్మాసనం, తాజగా ఏడుగురు సభ్యుల ధర్మాసనం..ఇలా ఈ కేసును ఇప్పటికే పలు ధర్మాసనాలు విచారించాయి. తాజాగా 9 మంది సభ్యుల ధర్మాసనానికి ఇది చేరనుంది. -
దేశానికి సేవ చేయండి
- సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ - ఘనంగా దామోదరం సంజీవయ్య లా వర్సిటీ స్నాతకోత్సవం సాక్షి, విశాఖపట్నం: న్యాయవాద వృత్తిలోకి వచ్చే ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో దేశానికి సేవ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ పిలుపునిచ్చారు. కార్పొరేట్ సంస్థలు చూపించే రాయితీలు, ఆఫర్లకు ఆకర్షితులు కావద్దని పేర్కొన్నారు. ఈ వృత్తిలోకి వచ్చేవారికి ఉజ్వల భవిష్యత్ ఉందని, ఆర్థికపరమైన ప్రయోజనాలకు తలొగ్గి కార్పొరేట్ సంస్థల వైపు మొగ్గు చూపితే ఉన్నత స్థాయిని కోల్పోతారన్నారు. దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం 2, 3 స్నాతకోత్సవాలు శనివారం విశాఖ పోర్టు కళావాణి ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జస్టిస్ ఠాకూర్ కీలకోపన్యాసం చేశారు. ప్రసంగం ఆయన మాటల్లోనే.. నేడు పరిస్థితులు మారాయి.. దేశంలో న్యాయవిద్య ఆది నుంచి నిర్లక్ష్యానికి గురవుతూనే ఉంది. నేను లా విద్యనభ్యసించిన రోజుల్లో కనీసం తరగతి గదులు కూడా లేవు. నేడు పరిస్థితులు మారాయి. సౌకర్యాలు పెరిగాయి. అవకాశాలు మెండుగా ఉన్నాయి. లా చదివే ప్రతి ఒక్కరూ ప్లేస్‌మెంట్స్ కోసం ఎదురు చూడడం, కార్పొరేట్ సంస్థలిచ్చే ఆఫర్స్ కోసం ఆసక్తి చూపడం సరికాదు. ప్రతిభావంతులకు రూ.లక్షల జీతాలతో అవకాశాలు వస్తున్నాయి. కానీ ఒకసారి కార్పొరేట్ సంస్థల్లో అడుగుపెడితే నాలుగు గోడలకే పరిమితమైపోతారు. అదే ఎవరైనా సీనియర్ వద్ద పదేళ్లు శిక్షణ పొందితే సుప్రీంకోర్టు వరకు వెళ్లొచ్చు. నైపుణ్యత సంపాదిస్తే న్యాయమూర్తులుగా ఎదిగి చీఫ్ జస్టిస్ పీఠాన్ని అధిరోహించవచ్చు. అక్కడ సౌకర్యాలుండటం లేదు దేశంలో ఏటా 60 వేల మంది లా పట్టాదారులు బయటికొస్తుంటే.. వారిలో కేవలం 2 వేల మంది మాత్రమే వర్సిటీల నుంచి వస్తున్నారు. మిగిలిన 58 వేల మంది ప్రైవేటు లా కళాశాలల నుంచి వస్తున్నారు. అక్కడ పూర్తి స్థాయి న్యాయ విద్యను పొందే సౌకర్యాలుండడం లేదు. లా కళాశాలలు, యూనివర్సిటీలు కూడా పరిశోధన కేంద్రాలుగా అభివృద్ధి చెందాలి. హైకోర్టు ఏర్పాటు చేయాలి: సీఎం స్నాతకోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ త్వరితగతిన హైకోర్టు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని చీఫ్ జస్టిస్‌ను కోరారు. అనంతరం 2011–15, 2012–16 సంవత్సరాల మధ్య డిగ్రీ పూర్తి చేసిన వారికి పట్టాలతోపాటు ఈ రెండు బ్యాచ్‌లలో అత్యుత్తమ ప్రతిభను కనపర్చిన వారికి సుప్రీంకోర్టు సీజే ఠాకూర్, యూనివర్సిటీ చాన్స్‌లర్, హైకోర్టు సీజే రమేష్ రంగనాథన్, సీఎం తదితరులు పురస్కారాలు ప్రదానం చేశారు. ఏపీ శాసనమండలి చైర్మన్ చక్రపాణికి జస్టిస్ ఠాకూర్ చేతుల మీదుగా డాక్టర్ ఆఫ్ లా ప్రదానం చేశారు. -
తదుపరి సీజేఐగా జస్టిస్ ఖేహర్
కేంద్రానికి లేఖ రాసిన ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఠాకూర్ - జనవరి 4న ప్రమాణం.. 44వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు - పలు కీలక తీర్పుల్లో భాగస్వామ్యం - ఆగస్టు 27 వరకు ఆ పదవిలో కొనసాగనున్న ఖేహర్ న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ జగదీష్‌సింగ్ ఖేహర్ బాధ్యతలు చేపట్టనున్నారు. న్యాయమూర్తుల నియామకం కోసం తెచ్చిన వివాదాస్పద జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ) చట్టాన్ని కొట్టివేస్తూ సంచలన తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనానికి ఆయనే నేతృత్వం వహించారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ పదవీకాలం వచ్చే జనవరి 3న ముగుస్తుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో అందరికంటే సీనియర్ అరుున జస్టిస్ ఖేహర్‌ను ఆ పదవిలో నియమించాలంటూ జస్టిస్ ఠాకూర్ మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. జస్టిస్ ఖేహర్ జనవరి 4న ప్రమాణం చేసి 44వ సీజేఐగా బాధ్యతలు స్వీకరిస్తారు. దాదాపు 8 నెలలపాటు అంటే ఆగస్టు 27 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. దేశ చరిత్రలో సిక్కువర్గానికి చెందిన వ్యక్తి సీజేఐగా బాధ్యతలు చేపట్టనుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. పలు ధర్మాసనాలకు నేతృత్వం.. జస్టిస్ ఖేహర్ సుప్రీంకోర్టులో పలు ధర్మాసనాలకు నేతృత్వం వహించారు. పలు కీలక తీర్పుల్లో భాగస్వామ్యం పంచుకున్నారు. ఎన్‌జేఏసీ కేసును విచారించిన ధర్మాసనానికి నేతృత్వం వహించడంతోపాటు గత జనవరిలో అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనను రద్దుచేసిన ధర్మాసనానికి కూడా ఆయనే నేతృత్వం వహించడం గమనార్హం. అలాగే సహారా చీఫ్ సుబ్రతారాయ్‌ను జైలుకు పంపిన కేసును విచారించిన ధర్మాసనంలోనూ ఆయన పాలుపంచుకున్నారు. ఇటీవల ఒకేరకమైన పనికి ఒకే వేతనం ఉండాలంటూ కాంట్రాక్టు ఉద్యోగుల కేసులో కీలక తీర్పిచ్చిన ధర్మాసనానికీ ఆయన నేతృత్వం వ్యవహరించారు. ఇటీవల అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వ్యాఖ్యలకు స్పందనగా, న్యాయవ్యవస్థకు లక్ష్మణరేఖ ఉందంటూ జస్టిస్ ఖేహర్ చెప్పడంతో.. జడ్జిల నియామకంపై న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య ఉన్న విభేదాలు మరోసారి ప్రస్ఫుటమయ్యారుు. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసు నేపథ్యంలో అన్ని సహజ నవరులను వేలం ద్వారానే విక్రరుుంచాలంటూ తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జిల ధర్మాసనంలోనూ జస్టిస్ ఖేహర్ భాగస్వామిగా ఉన్నారు. అలాగే ఏ సహజ వనరును కూడా చారిటీ, విరాళం పేరుతో ప్రైవేటుకు ధారాదత్తం చేయకూడదంటూ ఈ కేసులో ఆయన విడిగా రాసిన తీర్పులో స్పష్టంచేశారు. సహజ వనరులను దుర్వినియోగం చేయకూడదన్నారు. అంచెలంచెలుగా... పలు ధర్మాసనాల్లో భాగస్వామిగా ఉన్న జస్టిస్ ఖేహర్.. అవినీతి కేసులో ఆరోపణలున్న కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీడీ దినకరన్‌ను పదవి నుంచి తప్పించేందుకు రాజ్యసభ నియమించిన విచారణ కమిటీకి చైర్మన్‌గానూ పనిచేశారు. ఆయన సెప్టెంబర్ 13, 2011న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అంతకుముందు జస్టిస్ ఖేహర్ కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా చేశారు. ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా, పంజాబ్-హరియాణా హైకోర్టు తాత్కాలిక ప్రధానన్యాయమూర్తిగానూ చేశారు. ఫిబ్రవరి 8, 1999న పంజాబ్-హరియాణా హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఆగస్టు 28, 1952న జన్మించిన ఆయన పంజాబ్ వర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం పట్టా పొంది 1979లో న్యాయవాదిగా నమోదుచేసుకున్నారు. 1992 జనవరిలో పంజాబ్ అదనపు అడ్వొకేట్ జనరల్‌గా, ఆ తర్వాత చండీగఢ్ సీనియర్ స్టాండింగ్ కౌన్సెల్‌గా చేశారు. 1995 ఫిబ్రవరిలో సీనియర్ అడ్వొకేట్ హోదా పొందారు. పలు యూనివర్సిటీలు, కార్పొరేట్ సంస్థలు, పలు కంపెనీలు, సహకార సంస్థలకు న్యాయవాదిగా ఉన్నారు. -
బీసీసీఐ, లోధా ప్యానెల్ కేసు విచారణ 9కి వాయిదా
ఆ రోజే తుది తీర్పు న్యూఢిల్లీ: లోధా కమిటీ ప్రతిపాదనలను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అమలు చేసే వ్యవహారంపై సుప్రీం కోర్టు తమ తుది తీర్పును ఈనెల 9కి వాయిదా వేసింది. విచారణ బెంచ్‌లో ఉన్న ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ అస్వస్థత కారణంగా అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. చివరిసారిగా ఈ కేసును అక్టోబర్ 21న విచారించిన కోర్టు సోమవారం తుది తీర్పు ఇవ్వాల్సి ఉంది. ప్రతిపాదనల అమలు విషయంలో బీసీసీఐకి, లోధా ప్యానెల్‌కు మధ్య ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. 70 ఏళ్ల గరిష్ట వయస్సు, రెండు పదవుల మధ్య మూడేళ్ల విరామం, ఒక రాష్ట్రానికి ఒక ఓటు వంటి అంశాలను బోర్డు గట్టిగా వ్యతిరేకిస్తోంది. మరోవైపు ప్యానెల్ సూచించిన అంశాలను కచ్చితంగా అమలు పరచాల్సిందేనని కోర్టు గతంలోనే తీర్పునిచ్చింది. అయితే తాత్సారం చేస్తున్న బోర్డు వ్యవహారంపై ప్యానెల్ ఇటీవల మరో నివేదికను కోర్టుకు అందించారు. దీంట్లో ప్రస్తుతం ఉన్న ఆఫీస్ బేరర్లను తొలగించి, బోర్డు వ్యవహారాల పరిశీలకుడిగా హోం శాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లైను నియమించాలని కోరింది. అయితే నూతన సంస్కరణలను అమలు చేయాలని తమ రాష్ట్ర సంఘాలపై ఒత్తిడి చేయలేమని, మెజారిటీ ఓటింగ్ ద్వారానే ఇది సాధ్యమవుతుందని బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ చెబుతున్నారు. -
జడ్జీల నియామకాల్ని హైజాక్ చేయలేరు: చీఫ్ జస్టిస్ ఠాకూర్
న్యూఢిల్లీ: న్యాయమూర్తుల నియామకాల ప్రక్రియను హైజాక్ చేయలేరని, న్యాయవ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ అన్నారు. జడ్జీల ఎంపిక విషయంలో కార్యనిర్వాహక వ్యవస్థపై న్యాయవ్యవస్థ ఆధారపడకూడదని ఆయన పేర్కొన్నారు. భీమ్సేన్ సచార్ మెమోరియల్‌లో ‘స్వతంత్ర న్యాయవ్యవస్థ-ప్రజాస్వామ్యానికి పరిరక్షణ’ అంశంపై గురువారం మాట్లాడుతూ... న్యాయవ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించకపోతే రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులకు అర్థం ఉండదన్నారు. అన్నింటి కంటే స్వతంత్య్ర న్యాయ వ్యవస్థే ప్రజాస్వామ్యానికి ముఖ్యమని జస్టిస్ ఠాకూర్ అభిప్రాయపడ్డారు. నియమకాల పక్రియను హైజాక్ చేయడం ద్వారా న్యాయవ్యవస్థ ప్రభావితమయ్యే పరిస్థితి రాకూడదని ఎన్‌జేఏసీపై విచారించిన రాజ్యాంగం ధర్మాసనం అభిప్రాయపడిందని తెలిపారు. న్యాయ శాఖ మంత్రి, ప్రభుత్వం నియమించిన ప్రతినిధులు జడ్జీలను ఎంపిక చేయడం స్వతంత్ర న్యాయవ్యవస్థకు విఘాతమని ఠాకూర్ పేర్కొన్నారు. -
నిర్జీవ లేఖగా మార్చొద్దు
లోక్‌పాల్ నియామకంలో జాప్యంపై సుప్రీంకోర్టు అసంతృప్తి న్యూఢిల్లీ: లోక్‌పాల్ నియామకంలో కేంద్రం జాప్యాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. చట్టం ఓ ‘నిర్జీవమైన లేఖ’గా మారడాన్ని అనుమతించరాదని స్పష్టం చేసింది. అతిపెద్ద విపక్ష నేతను లోక్‌పాల్ ఎంపిక కమిటీలో చేర్చేలా చట్టాన్ని సవరించలేదనే పేరిట.. దేశవ్యాప్త ఆందోళనల నేపథ్యంలో రూపుదాల్చిన లోక్‌పాల్ చట్టాన్ని నిష్ర్పయోజనమైన దానిగా మార్చలేరని ధ్వజమెత్తింది. ప్రతిపక్ష నేత ఎంపిక కమిటీలో ఉండాలని లోక్‌పాల్, లోకాయుక్తల చట్టం చెబుతుండటం, ప్రస్తుత లోక్‌సభలో ప్రతిపక్ష నేత లేని పరిస్థితుల్లో.. కేంద్రం లోక్‌పాల్‌ను నియమించకుండా జాప్యం చేస్తూ వచ్చింది. అయితే అది సడలించదగిన అంశమేనని, అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నేతను కమిటీలో చేర్చడం ద్వారా ప్రక్రియను ముందుకు కొనసాగించవచ్చని ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ బుధవారం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన చట్ట సవరణ పార్లమెంటులో పెండింగ్‌లో ఉందని కేంద్రం చెప్పడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. చట్ట సవరణ చేయకపోవడం ద్వారా లోక్‌పాల్ నియామకానికి సంబంధించి ప్రజాభిప్రాయానికి తూట్లు పొడవజాలరని పేర్కొంది. -
నోట్ల రద్దుపై కేంద్రానికి ఎదురుదెబ్బ
హైకోర్టుల్లో కేసుల విచారణ నిలుపుదలకు సుప్రీం నో న్యూఢిల్లీ: పాత రూ. 500, రూ. 1,000 నోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రద్దును వ్యతిరేకిస్తూ దేశంలోని వివిధ హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లను విచారించకుండా ఆదేశాలు ఇవ్వాలన్న కేంద్రం విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం బుధవారం తోసిపుచ్చింది. నోట్లను రద్దు చేస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించొద్దని కేంద్రం వేసిన పిటిషన్‌ను ఈ నెల 18న సుప్రీంకోర్టు తిరస్కరించడం తెలిసిందే. బ్యాంకులు, ఏటీఎంల వద్ద భారీ క్యూలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, ఇదే పరిస్థితి కొనసాగితే అల్లర్లకు దారి తీయొచ్చని, ఇలాంటి సమయంలో కోర్టుల తలుపులు మూసేయలేమని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో హైకోర్టుల్లో దాఖలైన కేసుల విచారణ ప్రక్రియను నిలిపేయాలని తాజాగా కేంద్రం సుప్రీంను ఆశ్రరుుంచింది. నోట్ల రద్దు కేసుల విచారణను సుప్రీంకోర్టు లేదా ఏదైనా ఒక హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ విచారణ జరిపింది. ప్రస్తుతం పరిస్థితి చాలా వరకూ మెరుగుపడిందని, బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూలు తగ్గాయని, ఆన్లైన్లో నగదు వినియోగం బాగా పెరిగిందని అందువల్ల హైకోర్టుల్లో కేసుల విచారణపై స్టే విధించాలని కేంద్రం కోరింది. అరుుతే హైకోర్టుల్లో విచారణపై స్టే విధించేందుకు కోర్టు నిరాకరించింది. ఇందులో అనేక అంశాలు ఉన్నారుు. వీటిపై ప్రజలు హైకోర్టుల నుంచి తక్షణ ఉపశమనం పొందుతారు’ అని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావుతో కూడిన బెంచ్ పేర్కొంది. హైకోర్టు ముందుకు వచ్చిన అంశాల్లో విత్‌డ్రాలపై వారానికి రూ.24,000 పరిమితి విధించడం.. పాత రూ.500, రూ.1,000 నోట్లను ఆస్పత్రులు, పెట్రోల్ బంకుల్లో అనుమ తించాలని, ఏటీఎంల్లో సరిపడా నగదు నిల్వలు ఉంచేలా చర్యలు తీసు కోవాలని కోరుతూ పిటిషన్లు దాఖలయ్యాయని స్పష్టం చేసింది. రూ. 10 లక్షల కోట్లకు చేరే అవకాశం అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ నోట్ల రద్దు విజయవంతమైందని కోర్టుకు తెలిపారు. ఇప్పటి వరకూ రూ. 6 లక్షల కోట్లు డిపాజిట్లు వచ్చాయని, డిసెంబర్ చివరికి ఈ మొత్తం రూ. 10 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని అన్నారు. నగదును వివిధ ప్రాంతాలను రవాణా చేయడమే సమస్యగా మారిందని వివరించారు. అయితే కేంద్రం వాదనలతో కోర్టు సంతృప్తి చెందలేదు. వివిధ హైకోర్టులను ఆశ్రరుుంచిన పిటిషనర్లు, వ్యక్తులు స్పందన తెలియజేయాలని నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను డిసెంబర్ 2వ తేదీకి వారుుదా వేసింది. -
కొలీజియం సిఫారసుల తిరస్కరణపై సుప్రీంకోర్టు
-
కేంద్రం వైఖరిని అంగీకరించం
కొలీజియం సిఫారసుల తిరస్కరణపై సుప్రీంకోర్టు - ఆ 43 పేర్లను పునఃపరిశీలనకు పంపినట్లు వెల్లడి న్యూఢిల్లీ: దేశంలోని వివిధ హైకోర్టులకు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం సిఫారసు చేసిన 43 పేర్లను తిరస్కరిస్తూ కేంద్ర ప్రభుత్వం అవలంభించిన వైఖరిని తాము అంగీకరించడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ 43 పేర్లను పునఃపరిశీలనకు తిప్పి పంపినట్లు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్, న్యాయమూర్తి ఏఆర్ దవేలతో కూడిన ధర్మాసనం శుక్రవారం తెలిపింది. ఈ అంశంపై గత మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా కేంద్రం చేసిన నివేదనను అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ప్రస్తావించగా.. కోర్టు ఈ మేరకు ప్రకటన చేసింది. ‘దాన్ని మేం చూశాం..’ అని ఐదుగురు సభ్యుల కొలీజియంకు నేతృత్వం వహిస్తున్న భారత ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అయితే ఆ విషయం తనకు తెలియదని ఏజీ చెప్పారు. దీనిపై తదుపరి విచారణను శీతాకాలపు సెలవుల తర్వాత చేపడతామని ధర్మాసనం పేర్కొంది. కొలీజియం సిఫారసు చేసిన 77 పేర్లకు గాను 34 పేర్లకు తాము ఆమోదం తెలిపినట్లు మంగళవారం నాటి విచారణ సందర్భంగా కేంద్రం సుప్రీంకు తెలిపింది. జడ్జీల నియామకంపై సిఫారసుల సంబంధిత ఫైలేదీ తమ వద్ద పెండింగ్‌లో లేదంది. 34 పేర్లను ఆమోదించామని, మిగతా 43 పేర్లను న్యాయస్థానానికి తిప్పి పంపినట్లు ఏజీ గత మంగళవారం ధర్మాసనానికి నివేదించారు. కొలీజియం సిఫారసుల తర్వాత కూడా న్యాయమూర్తుల నియామకంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీం గతంలోనే కేంద్రాన్ని నిలదీసింది. ఫైళ్ల నత్తనడకపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వాస్తవ పరిస్థితి ఏమిటో తెలుసుకునేందుకు అవసరమైతే పీఎంవో, న్యాయ శాఖ కార్యదర్శులను కోర్టుకు పిలుస్తామని కూడా హెచ్చరించింది. కాగా, శుక్రవారం సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఏఆర్ దవేకు చివరి పనిరోజు కావటంతో ఆయన పదవీ విరమణ తీసుకున్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ పదవీ కాలం వచ్చే జనవరి 3న ముగియనుంది. ఈయన స్థానంలో జస్టిస్ జేఎస్ ఖేహర్ బాధ్యతలు స్వీకరిస్తారు. -
నోట్లు తడపడంపై సుప్రీం సీరియస్!
న్యూఢిల్లీ : కొత్త రూ.2000 నోట్లు తడిపితే, రంగుపోతున్నాయంటూ నమోదైన పిటిషన్లపై అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. నోట్లను ఎందుకు తడపారంటూ న్యాయవాదిని ప్రశ్నించింది. నోట్లను నీళ్లలో తడపవద్దంటూ చీఫ్ జస్టిస్ టీఎస్ థాకూర్, పిటిషనర్ల తరుఫు లాయర్ ఎంఎల్ శర్మకు సూచించారు. తడిపితే కొత్తనోట్లు రంగు పోతున్నాయంటూ.. ప్రధాని మోదీ ప్రకటించిన రూ.500, రూ.1000 నోట్ల రద్దును నిలిపివేయాలని కోరుతూ పలు పిటిషన్లు సుప్రీంలో దాఖలయ్యాయి. ఈ నోట్లలో రెండో రంగుగా కుసుంభ వర్ణం ఉందని, అది తడిపితే రంగుపోతుందని అధికారులు సైతం దృవీకరించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి తిరస్కరించిన సుప్రీంకోర్టు, బ్యాంకులు, ఏటీఎంల వద్ద కట్టిన క్యూలైన్లు, అసౌకర్య పరిస్థితులపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రూ. 500, వెయ్యినోట్లను రద్దుచేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ప్రజలు నగదు మార్చుకోవడానికి బ్యాంకుల ముందు పడిగాపులు పడుతున్న సంగతి తెలిసిందే. సరికొత్త టెక్నాలజీ ఉపయోగించి తయారుచేసిన ఈ నోట్లను వాషింగ్ మెషిన్లో వేసిన ఓ వీడియో సైతం వైరల్ అయింది. నోట్లపై పలువురుకు ఉన్న అనుమానాలు ఈ వీడియో చూస్తే పటాపంచలవుతాయని, పేర్కొంటూ ఈ వీడియో పోస్టు అయింది. -
ఎంట్రీ టాక్స్ సబబే!
తేల్చిచెప్పిన రాజ్యాంగ ధర్మాసనం న్యూఢిల్లీ: రాష్ట్రాలు విధించే ఎంట్రీ టాక్సులో తప్పేమీలేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి పన్ను వసూలు చట్టాలను రూపొందించుకోవటం ఆయా రాష్ట్రాల హక్కు అని శుక్రవారం వెల్లడించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని 9 మంది సభ్యుల బెంచ్ దీనిపై చర్చించింది. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వాలకు పన్ను వసూలు చేసే హక్కుందని 7-2 మెజారిటీతో ధర్మాసనం తీర్పు చెప్పింది. ‘పక్కరాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై పన్ను, సొంత రాష్ట్రంలో తయారీ పన్ను ఒకేలా ఉండేలా.. అవసరాలకు అనుగుణంగా ఆర్థిక నిబంధనలు మార్చుకోవటం రాష్ట్రాల హక్కు. ఈ విధానాన్ని అనుసరిస్తే రాష్ట్రాలు రాజ్యాంగంలోని 304 (ఏ) సెక్షన్‌ను అతిక్రమించినట్లు కాదు’ అని జస్టిస్ టీఎస్ ఠాకూర్ తెలిపారు. దీనిపై జస్టిస్ ఎస్ఏ బాబ్దే, జస్టిస్ శివ కీర్తిసింగ్, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఆర్ భానుమతిలు ఏకీభవించినట్లు తెలిపారు. రాష్ట్రాలు ఎంట్రీ టాక్స్ విధించే చట్టాలను రూపొందించటం రాజ్యాంగ విరుద్ధమంటూ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్ మెజారిటీ అభిప్రాయంతో విభేదించారు. ‘పన్నులకు సంబంధించిన ఏ చట్టమైనా రాజ్యాంగంలోని 304 (ఏ) సెక్షన్ పరిధిలో ఉండాలి. ఇలాంటి చట్టం వివక్షరహితంగా ఉందని మెజారిటీ సభ్యులు భావిస్తే.. దీనికి రాజ్యాంగ బద్ధత కల్పించవచ్చు’ అని 911 పేజీల తీర్పులలో సుప్రీం పేర్కొంది. ‘పక్కరాష్ట్రంలో ఉత్పత్తి అరుున వస్తువుకు భారీగా పన్ను విధించటం ద్వారా సొంతరాష్ట్రంలో దీని ధర పెరుగుతుంది. కానీ ఇలా పన్ను విధించటాన్ని రాజ్యాంగ విరుద్ధంగా భావించలేం’ అని బెంచ్ పేర్కొంది. ఈ సమస్యలను రాష్ట్రాలే పరిష్కరించుకుంటాయంది. ఆర్టికల్ 301 ప్రకారం వివక్షలేని పన్ను విధానంపై రాజ్యాంగ నియంత్రణ ఉంచకూడదని.. స్వేచ్ఛావాణిజ్య హక్కును కల్పించాలని ధర్మాసనం గుర్తుచేసింది. ఆర్టికల్ 301 ప్రకారం వస్తువులు, సేవలు, వ్యక్తులు, వాణిజ్యం, వ్యాపారం, లావాలదేవీల మూలధనం విషయంలో దేశమంతా ఒకే విధానం ఉండాలని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. 42 మంది పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా చండీగఢ్: సట్లేజ్-యమునా లింక్ (ఎస్‌వైఎల్) కెనాల్ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎస్‌వైఎల్ వివాదంలో సుప్రీం కోర్టు తీర్పుకు నిరసనగా గురువారం పంజాబ్ పీసీసీ చీఫ్ అమరీందర్ సింగ్ పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయగా.. శుక్రవారం 42 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. చండీగఢ్ రోడ్లపై పాదయాత్రగా బయలుదేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ శాసనసభాపక్ష హాల్లో సమావేశమై.. అసెంబ్లీ సెక్రటరీకి రాజీనామా లేఖలు సమర్పించారు. అరుుతే వీరి రాజీనామాలపై స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీంతోపాటు ఈ వివాదాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దృష్టికి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణరుుంచింది. -
మతం పేరుతో ఓట్లడగటం నేరమా?
కులం, మతం కీలక రాజకీయాంశాలుగా మారాయని వ్యాఖ్య న్యూఢిల్లీ: భారత రాజకీయాల్లో మతం, కులం కీలకాంశాలుగా మారాయని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ అంశాన్ని ఎన్నికల చట్టం ప్రకారం అవినీతి చర్యగా భావించవచ్చా? అని బుధవారం ప్రశ్నించింది. ఒక అభ్యర్థి కులం, మతం, జాతి పేరుతో ఓట్లు అడగటాన్ని నేరంగా పరిగణించటం సాధ్యమేనా అని అడిగింది. ఎన్నికల చట్టంలో అక్రమ కార్యకలాపాలపై చర్యలను వివరించే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 123 (3) సెక్షన్ పరిధిపై చర్చ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘ఒకవ్యక్తి ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతోంది. నన్ను గెలిపిస్తే మీ అభ్యున్నతికి పాటుపడతాను. నాకు ఓటేయండని అడిగితే తప్పేంటి?’ అని కూడా కోర్టు ప్రశ్నించింది. బుధవారం రోజంతా జరిగిన చర్చలో మంగళవారం నాటి ‘హిందుత్వం మతం కాదు, జీవన విధానం’ అనే విషయాన్ని ధర్మాసనం పునరుద్ఘాటించింది. అయితే ‘హిందుత్వ’ అంశాన్ని సుప్రీంకోర్టు తర్వాతైనా మరోసారి చర్చించాల్సిన పరిస్థితి వస్తుందని కక్షిదారుల తరపు న్యాయవాది కపిల్ సిబల్ ధర్మాసనాన్ని కోరారు. భారతీయ శిక్ష్మా స్మృతిలోని 153 (ఏ)ను ఉదహరిస్తూ.. మతంపేరుతో ఓట్లు అడగటం ద్వారా సమాజంలోని భిన్న వర్గాల మధ్య గొడవలు పెట్టేలా వ్యవహరించే వ్యక్తి నేర విచారణకు అర్హుడని సిబల్ కోర్టుకు తెలిపారు. కులం, మతం పేరుతో ఓట్లను రాబట్టుకోవటంలో రాజకీయనేతలు ముదిరిపోయారని.. ఈ పద్ధతికి బ్రేక్ వేయటం తక్షణ అవసరమని కోర్టుకు విన్నవించారు. దీనిపై పలువురి వాదనలు విన్న కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది. -
‘హిందుత్వ’ తీర్పును మళ్లీ పరిశీలించం: సుప్రీం
న్యూఢిల్లీ: ఎన్నికల్లో అక్రమాలకు సంబంధించి 1995నాటి వివాదాస్పద తీర్పు పునఃపరిశీలనకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ‘హిందుత్వ’ తీర్పుగా పేరొందిన ఆ తీర్పుపై మంగళవారం స్పందిస్తూ.. ఈ సమయంలో మతపర విషయాన్ని పరిశీలించబోమని ఏడుగురు జడ్జీల రాజ్యాంగ బెంచ్ స్పష్టం చేసింది. హిందుత్వ అంటే ఏమిటి? దాని అర్థం ఏమిటి? అనే విషయంలో పెద్ద చర్చకు వెళ్లబోమని పేర్కొంది. 1995 తీర్పును పునఃపరిశీలించబోమని, హిందుత్వ లేదా మతం అనే దానిని ఈ సమయంలో పరిశీలించబోమని స్పష్టం చేసింది. ఈ సమయంలో తాము విచారించవలసిన విషయానికి మాత్రమే కట్టుబడి ఉంటామని, ఐదుగురు జడ్జీలు సూచించిన విచారణ అంశంలో హిందుత్వ అనే పదం ఉందని ఎవరైనా చూపిస్తే.. వారి వాదన వింటామని బెంచ్ పేర్కొంది. కాగా, ఐదుగురు జడ్జీల సూచన మేరకు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 123(3) సెక్షన్ పరిధిని, విస్తృతిని ప్రస్తుత బెంచ్ పరిశీలించాల్సి ఉంది. రాజకీయాల్లో మతాన్ని జోడించకూడదని, ఈ విషయంలో జోక్యం చేసుకుని ఉత్తర్వులు జారీచేయాలని, ప్రస్తుత విచారణలో తనకు అవకాశం కల్పించాలని ఓపీ గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇదే విషయంలో తన వాదనలు కూడా వినాలని గతంలో సామాజిక కార్యకర్త తీస్తా సెతెల్వాద్ కూడా పిటిషన్ దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఏకే గోయెల్, జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు ఉన్నారు. -
సీజేఐ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఎన్వీ రమణతో బాబు భేటీ
సాక్షి, తిరుమల: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్, న్యాయమూర్తి ఎన్వీ రమణతో మరోసారి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గురువారం రాత్రి లీలావతి అతిథిగృహంలో బస చేసిన చంద్రబాబు ఉదయాన్నే పద్మావతి అతిథి గృహంలో ఉన్న చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఎన్వీ రమణలతో సమావేశమయ్యారు. అనంతరం తిరుమల నుంచి బయలుదేరివెళ్లారు. శుక్రవారం వేకువజామున అభిషేక సేవలో జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు మరోసారి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయంలోని అఖిలాండం వద్ద కొబ్బరికాయ మొక్కులు చెల్లించారు. ఉదయం 8.30 సమయంలో న్యాయమూర్తులు కూడా తిరుమల నుంచి తిరుగుప్రయాణమయ్యారు. వీరికి టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, చిత్తూ రు జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్, టీటీడీ లీగల్ ఆఫీసర్ వెంకట్రమణ, జిల్లా జడ్జి దుర్గాప్రసాద్, ప్రొటోకాల్ జడ్జి శేషాద్రి వీడ్కోలు పలికారు. గురువారం రాత్రి శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న తర్వాత న్యాయమూర్తులు తిరుమలలోనే బసచేశారు. -
ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రియమైన ప్రధానికి శుభాకాంక్షలు చెప్పేందుకు ప్రముఖుల నుంచి సాధారణ ప్రజల వరకూ పోటీపడుతున్నారు. సొంత రాష్ట్రం గుజరాత్లో ఉన్న ప్రధాని మోదీని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ శనివారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. గాంధీనగర్ లోని రాజ్ భవన్ లో ప్రధానమంత్రిని నరేంద్ర మోదీని కలిసి పుష్పగుచ్ఛం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తనను కలిసేందుకు వచ్చిన చీఫ్ జస్టిస్‌ను ప్రధాని గుమ్మంలోకి ఎదురెళ్లి సాదరంగా ఆహ్వానించారు. అలాగే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ...ప్రధానికి బర్త్‌డే విషెస్ చెప్పారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్, నితీష్ గడ్కరి, ఆనందీ బెన్ పటేల్, విజయ్ రూపానీ, రాజ్‌వర్థన్ సింగ్ రాథోడ్, సైనా నెహ్వాల్, విజేంద్ర సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, తమ శుభాకాంక్షలు తెలిపారు. యాపిల్ సీఈవో టిమ్ కుక్ కూడా ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచం అంతా ఒకే కుటుంబం అని టిమ్ కుక్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో తన పుట్టిన రోజు వేడుక జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్...ఒడిశాలోని పూరి సముద్రతీరాన ప్రధాని పుట్టిన రోజు సందర్భంగా చక్కటి సైకత శిల్పాన్ని రూపొందించారు. మోదీ చీపురు పట్టుకుని ఊడుస్తుండగా ’ఉయ్ ఆర్ కమిటెడ్ టూ స్వచ్ఛ్ భారత్’ అంటూ ప్రత్యేకంగా సైకత శిల్పాన్ని సృష్టించారు. -
70 ఏళ్లకు ఎందుకు తప్పుకోరు?
బీసీసీఐ సభ్యులకు సుప్రీం ప్రశ్న న్యూఢిల్లీ: జస్టిస్ ఆర్ఎం లోధా కమిటీ పేర్కొన్న గరిష్ట వయస్సు ప్రతిపాదనను బీసీసీఐ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజుల్లో రాజకీయ నాయకులు 70 ఏళ్లకు రిటైర్మెంట్ తీసుకుంటుండగా బోర్డు ఆఫీస్ బేరర్లు మాత్రం ఆ నియమాన్ని ఎందుకు పాటించరని దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. లోధా ప్యానెల్ సూచించిన కొన్ని ప్రతిపాదనలను అమలు చేయడం సాధ్యం కాదని తమిళనాడు క్రికెట్ సంఘం తరఫు వాదనలపై సుప్రీం విచారణ జరిపింది. అసలు 60 ఏళ్లకే పదవి నుంచి వైదొలగాలి. ప్రస్తుతం నాయకులను బలవంతంగానైనా 70 ఏళ్లకు రిటైర్ అయ్యేలా చేస్తున్నారు. మరి బీసీసీఐ అధికారులు మాత్రం ఎందుకు ఇలా చేయరు. అంతకుమించి వయస్సు కలిగిన వారు తమ అనుభవంతో సలహాదారుని పాత్ర పోషిస్తే చాలు. దాల్మి యా 75 ఏళ్ల వయస్సులో అసలు సరిగా మాట్లాడే స్థితిలో కూడా లేరు. ఇలాంటి స్థితిలో బోర్డు కార్యకలాపాలు ఎలా సాగుతాయి?’ అని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్‌తో కూడిన బెంచ్ ప్రశ్నించింది. -
శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం ఉదయం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీ.ఎస్ ఠాకూర్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్.వి.రమణ దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ప్రముఖులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు న్యాయమూర్తులకు వేదాశీర్వాదాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. -
సుప్రీం బెంచ్ ఎందుకు ఏర్పాటు చేయలేదు?
టీనగర్ : చెన్నైలో సుప్రీంకోర్టు బెంచ్‌ను ఇరవై ఏళ్లుగా ఎందుకు ఏర్పాటు చేయలేదని సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పుదుచ్చేరికి చెందిన న్యాయవాది వసంతకుమార్ చెన్నైలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు గురించి సుప్రీంకోర్టులో ఒక ప్రజాహిత పిటిషన్ దాఖలు చేశారు. 1986లో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశానని, అందులో ఢిల్లీలో మాత్రమే సుప్రీంకోర్టు ఉన్నందున దక్షిణాది ప్రజలు ముఖ్యంగా తమిళనాడుకు చెందిన వారు తమ అప్పీళ్లు, కేసుల కోసం ఢిల్లీకి రావాల్సివస్తోందని, దీంతో వారికి అధిక ఖర్చులు, సమయం వృథా జరుగుతోందన్నారు. అందువల్ల చెన్నై, కోల్‌కతా, ముంబైలలో సుప్రీం బెంచ్‌లు ఏర్పాటుచేయాలని కోరారు. దీన్ని అంగీకరించిన సుప్రీంకోర్టు 1986లోనే అప్పీలు చేసేందుకు సుప్రీంకోర్టు బెంచ్‌ను చెన్నైలో ఏర్పాటుచేసేందుకు ఉత్తర్వులిచ్చింది. అయితే దీనిగురించి గత 20 ఏళ్లుగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఉత్తర్వులను నెరవేర్చేందుకు కోర్టు మళ్లీ ఒక ఉత్తర్వు జారీ చేయాలని కోరారు. ఈ కేసు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ ఆధ్వర్యంలోని బెంచ్ విచారణ జరిపింది. అనంతరం దీని గురించి ఎందుకు చర్యలు తీసుకోలేదని ఇందులో కేంద్ర ప్రభుత్వం, న్యాయశాఖ చర్యలేమిటని ప్రశ్నించింది. దీనికి సంబంధించి సీనియర్ న్యాయవాదులు కేకే వేణుగోపాల్, సల్మాన్‌ఖాన్ కుర్షిద్‌ను సలహాదారులుగా నియమిస్తూ న్యాయమూర్తులు ఉత్తర్వులిచ్చారు. ఇరువురూ అందులోని సమస్యలను కోర్టులో తెలియజేయాలని కోరారు. -
ప్రభుత్వ పనితీరును విశ్లేషించాల్సిన సమయమిది
సీజేఐ ఠాకూర్ వ్యాఖ్య జమ్మూ: చట్టాల అమలు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరును విశ్లేషించాల్సిన సమయం వచ్చిందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ విమర్శించారు. ‘జైళ్లు నిండిపోతున్నాయి.. బయటి జనాలు న్యాయం కోసం అల్లాడుతున్నారని.. ఈ సమయంలో జడ్జిల నియామకాలు జరపకుండా కేంద్రం తాత్సారం చేయలేదన్నారు. జమ్మూలో లీగల్ సెమినార్ ప్రారంభోత్సవంలో సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. -
త్రిసభ్య ధర్మాసనానికి బాబ్లీ కేసు
కమిటీలో తెలంగాణకు చోటుపై విచారణ వాయిదా సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టుపై పర్యవేక్షణకు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నియమించిన బాబ్లీ పర్యవేక్షణ కమిటీలో తెలంగాణ రాష్ట్రానికి చోటివ్వాలని కేంద్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను త్రిసభ్య ధర్మాసనానికి నివేదిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ టి.ఎస్.ఠాకూర్, జస్టిస్ ఆదర్శ్‌కుమార్ గోయల్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. సోమవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. బాబ్లీ పర్యవేక్షణ కమిటీలో ఇప్పటివరకు సభ్యులుగా ముగ్గురు ప్రతినిధులు ఉన్నారు. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ప్రతినిధులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయినందున కొత్త రాష్ట్రానికి చోటు ఇవ్వాలని కేంద్రం ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా మహారాష్ట్ర ప్రభుత్వం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన బాబ్లీ ప్రాజెక్టు నిర్మించిన సంగతి తెలిసిందే. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోనే ఎగువన ఈ బాబ్లీ ప్రాజెక్టు నిర్మించి తద్వారా నీటిని కిందికి వదలకుండా అక్రమంగా వాడుకునే ఉద్దేశంతో మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందని ఆంధ్రప్రదేశ్ 2006 నుంచి సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసింది. అయితే బాబ్లీపై దాఖలైన వ్యాజ్యాలను విచారించిన మీదట సుప్రీంకోర్టు 2013 ఫిబ్రవరి 28న కేసును పరిష్కరిస్తూ ఒక త్రిసభ్య పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. దీనికి సీడబ్ల్యూసీ ప్రతినిధి ఛైర్మన్‌గా ఉంటారని పేర్కొంది. ఈ కమిటీ బాబ్లీ ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వం 2.74 టీఎంసీల నీటి కంటే ఎక్కువగా వినియోగించుకోకుండా పర్యవేక్షించాలి. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం 2013 అక్టోబరు 17న కమిటీని ఏర్పాటుచేసింది. విభజన నేపథ్యంలో ఈ కమిటీలో తెలంగాణకు స్థానం కల్పించాలని కేంద్రం వేసిన పిటిషన్ ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్‌ల్లో విచారణకు వచ్చి వాయిదాపడింది. తాజాగా సోమవారం మరోసారి విచారణకు రాగా.. కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది ‘బాబ్లీతో ఏపీకి సంబంధం లేదని మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలు అంటున్నాయి.. అందువల్ల కమిటీలో తెలంగాణకు స్థానం కల్పించండి..’ అని పేర్కొన్నారు. మహారాష్ట్ర తరఫు న్యాయవాది దీనిపై ఏకీభవించారు. దీంతో న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ స్పందిస్తూ ‘బాబ్లీ పర్యవేక్షణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటుకు ఆదేశాలిచ్చింది త్రిసభ్య ధర్మాసనం. అందువల్ల త్రిసభ్య ధర్మాసనానికే నివేదిద్దాం..’ అని ఆ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు.