కొలీజియం సిఫారసుల తిరస్కరణపై సుప్రీంకోర్టు | We cant accept Central government attitude | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 19 2016 7:04 AM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

దేశంలోని వివిధ హైకోర్టులకు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం సిఫారసు చేసిన 43 పేర్లను తిరస్కరిస్తూ కేంద్ర ప్రభుత్వం అవలంభించిన వైఖరిని తాము అంగీకరించడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ 43 పేర్లను పునఃపరిశీలనకు తిప్పి పంపినట్లు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్, న్యాయమూర్తి ఏఆర్ దవేలతో కూడిన ధర్మాసనం శుక్రవారం తెలిపింది. ఈ అంశంపై గత మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా కేంద్రం చేసిన నివేదనను అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ప్రస్తావించగా.. కోర్టు ఈ మేరకు ప్రకటన చేసింది. ‘దాన్ని మేం చూశాం..’ అని ఐదుగురు సభ్యుల కొలీజియంకు నేతృత్వం వహిస్తున్న భారత ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అయితే ఆ విషయం తనకు తెలియదని ఏజీ చెప్పారు. దీనిపై తదుపరి విచారణను శీతాకాలపు సెలవుల తర్వాత చేపడతామని ధర్మాసనం పేర్కొంది.

Advertisement
 
Advertisement
 
Advertisement