నోట్లు తడపడంపై సుప్రీం సీరియస్!
నోట్లు తడపడంపై సుప్రీం సీరియస్!
Published Fri, Nov 18 2016 7:25 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
న్యూఢిల్లీ : కొత్త రూ.2000 నోట్లు తడిపితే, రంగుపోతున్నాయంటూ నమోదైన పిటిషన్లపై అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. నోట్లను ఎందుకు తడపారంటూ న్యాయవాదిని ప్రశ్నించింది. నోట్లను నీళ్లలో తడపవద్దంటూ చీఫ్ జస్టిస్ టీఎస్ థాకూర్, పిటిషనర్ల తరుఫు లాయర్ ఎంఎల్ శర్మకు సూచించారు. తడిపితే కొత్తనోట్లు రంగు పోతున్నాయంటూ.. ప్రధాని మోదీ ప్రకటించిన రూ.500, రూ.1000 నోట్ల రద్దును నిలిపివేయాలని కోరుతూ పలు పిటిషన్లు సుప్రీంలో దాఖలయ్యాయి. ఈ నోట్లలో రెండో రంగుగా కుసుంభ వర్ణం ఉందని, అది తడిపితే రంగుపోతుందని అధికారులు సైతం దృవీకరించారు.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి తిరస్కరించిన సుప్రీంకోర్టు, బ్యాంకులు, ఏటీఎంల వద్ద కట్టిన క్యూలైన్లు, అసౌకర్య పరిస్థితులపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రూ. 500, వెయ్యినోట్లను రద్దుచేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ప్రజలు నగదు మార్చుకోవడానికి బ్యాంకుల ముందు పడిగాపులు పడుతున్న సంగతి తెలిసిందే. సరికొత్త టెక్నాలజీ ఉపయోగించి తయారుచేసిన ఈ నోట్లను వాషింగ్ మెషిన్లో వేసిన ఓ వీడియో సైతం వైరల్ అయింది. నోట్లపై పలువురుకు ఉన్న అనుమానాలు ఈ వీడియో చూస్తే పటాపంచలవుతాయని, పేర్కొంటూ ఈ వీడియో పోస్టు అయింది.
Advertisement
Advertisement