టీనగర్ : చెన్నైలో సుప్రీంకోర్టు బెంచ్‌ను ఇరవై ఏళ్లుగా ఎందుకు ఏర్పాటు చేయలేదని సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పుదుచ్చేరికి చెందిన న్యాయవాది వసంతకుమార్ చెన్నైలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు గురించి సుప్రీంకోర్టులో ఒక ప్రజాహిత పిటిషన్ దాఖలు చేశారు. 1986లో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశానని, అందులో ఢిల్లీలో మాత్రమే సుప్రీంకోర్టు ఉన్నందున దక్షిణాది ప్రజలు ముఖ్యంగా తమిళనాడుకు చెందిన వారు తమ అప్పీళ్లు, కేసుల కోసం ఢిల్లీకి రావాల్సివస్తోందని, దీంతో వారికి అధిక ఖర్చులు, సమయం వృథా జరుగుతోందన్నారు.
అందువల్ల చెన్నై, కోల్‌కతా, ముంబైలలో సుప్రీం బెంచ్‌లు
ఏర్పాటుచేయాలని కోరారు. దీన్ని అంగీకరించిన సుప్రీంకోర్టు 1986లోనే అప్పీలు చేసేందుకు సుప్రీంకోర్టు బెంచ్‌ను చెన్నైలో ఏర్పాటుచేసేందుకు ఉత్తర్వులిచ్చింది. అయితే దీనిగురించి గత 20 ఏళ్లుగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఉత్తర్వులను నెరవేర్చేందుకు కోర్టు మళ్లీ ఒక ఉత్తర్వు జారీ చేయాలని కోరారు.
ఈ కేసు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ ఆధ్వర్యంలోని బెంచ్ విచారణ జరిపింది. అనంతరం దీని గురించి ఎందుకు చర్యలు తీసుకోలేదని ఇందులో కేంద్ర ప్రభుత్వం, న్యాయశాఖ చర్యలేమిటని ప్రశ్నించింది. దీనికి సంబంధించి సీనియర్ న్యాయవాదులు కేకే వేణుగోపాల్, సల్మాన్‌ఖాన్ కుర్షిద్‌ను సలహాదారులుగా నియమిస్తూ న్యాయమూర్తులు ఉత్తర్వులిచ్చారు. ఇరువురూ అందులోని సమస్యలను కోర్టులో తెలియజేయాలని కోరారు.
సుప్రీం బెంచ్ ఎందుకు ఏర్పాటు చేయలేదు?
Published Sun, Feb 28 2016 3:32 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement
Advertisement