సీజేఐ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఎన్వీ రమణతో బాబు భేటీ | chandrababu meeting with TS Thakur and Justice NV ramana | Sakshi
Sakshi News home page

సీజేఐ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఎన్వీ రమణతో బాబు భేటీ

Published Sat, Oct 15 2016 3:41 AM | Last Updated on Sat, Jul 28 2018 3:33 PM

సీజేఐ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఎన్వీ రమణతో బాబు భేటీ - Sakshi

సీజేఐ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఎన్వీ రమణతో బాబు భేటీ

సాక్షి, తిరుమల: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్, న్యాయమూర్తి ఎన్‌వీ రమణతో మరోసారి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గురువారం రాత్రి లీలావతి అతిథిగృహంలో బస చేసిన చంద్రబాబు ఉదయాన్నే పద్మావతి అతిథి గృహంలో ఉన్న చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఎన్‌వీ రమణలతో  సమావేశమయ్యారు. అనంతరం తిరుమల నుంచి బయలుదేరివెళ్లారు.  శుక్రవారం వేకువజామున అభిషేక సేవలో జస్టిస్ ఎన్‌వీ రమణ దంపతులు మరోసారి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయంలోని అఖిలాండం వద్ద కొబ్బరికాయ మొక్కులు చెల్లించారు.

ఉదయం 8.30 సమయంలో న్యాయమూర్తులు కూడా తిరుమల నుంచి తిరుగుప్రయాణమయ్యారు. వీరికి టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, చిత్తూ రు జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్, టీటీడీ లీగల్ ఆఫీసర్ వెంకట్రమణ, జిల్లా జడ్జి దుర్గాప్రసాద్, ప్రొటోకాల్ జడ్జి శేషాద్రి వీడ్కోలు పలికారు. గురువారం రాత్రి శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న తర్వాత న్యాయమూర్తులు తిరుమలలోనే బసచేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement