న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విశ్వరూపం చూపిస్తోంది. దేశంలో కరోనా కేసులు 4 లక్షలు దాటాయి. వరుసగా పదవ రోజు కూడా పదివేలకుపైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 15,413 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. 306 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసులు 4,10,461కాగా.. మృతుల సంఖ్య 13,254కు చేరుకుంది.
దేశంలో తొలి కరోనా కేసు నమోదనప్పటి నుంచి ఈ స్థాయిలో కేసులు నమోదుకావడం ఇదే ప్రథమం. కాగా.. ఇప్పటివరకు భారత్‌లో కరోనా నుంచి 2,27,756 మంది పూర్తిగా కోలుకోగా, 1,69,451 మంది చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,90,730 కరోనా టెస్టులు నిర్వహించగా.. మొత్తంగా ఇప్పటి వరకు 68,07,226 కరోనా టెస్టులు నిర్వహించారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో అమెరికా, బ్రెజిల్, రష్యా తర్వాత భారత్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment