ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికి లాక్‌డౌన్ విధించి నేటికి 21 రోజులు అవుతున్నా పాజిటివ్‌ల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకు వందలు, వేల సంఖ్యల్లో పాజిటివ్ కేసులు నమోదవుతుండటం అందరినీ భయాందోళనలకు గురిచేస్తోంది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన గణాంకాల ప్రకారం దేశంలో కరోనా బాధితుల సంఖ్య 10వేలు దాటింది.
గడిచిన 24 గంటల్లో 1211 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయ్యాయి.. 31 మంది చనిపోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 10,363కు చేరుకుంది. ఇప్పటివరకు 339 మంది మృత్యువాతపడ్డారు. దేశ వ్యాప్తంగా 1035 కరోనా బాధితులు కొలుకున్నారని అధికార గణాంకాలు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఉదయం వరకు 17,76,867 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 1,11,828 మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment