కోర్టులవి ద్వంద్వ ప్రమాణాలు: జైట్లీ
ముంబై: పార్లమెంట్ చట్టరూపంలో రూపొందించిన టైమ్‌లైన్స్‌ని పాటించడం కార్యనిర్వాహక వ్యవస్థకు తప్పనిసరి కాగా, న్యాయ వ్యవస్థకు అలా లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. భారత కోర్టులు ద్వంద్వ ప్రమాణాలను అవలంబిస్తున్నాయని పేర్కొన్నారు. కార్పొరేట్ వ్యవహారాల శాఖ శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
‘సంప్రదాయంగానే మన కోర్టులవి ద్వంద్వ ప్రమాణాలు. టైమ్‌లైన్స్‌కు కార్యనిర్వాహక శాఖ కట్టుబడి ఉంటుంటే, కోర్టులు మాత్రం అవి తమకు మార్గదర్శకాలు మాత్రమే అని పేర్కొంటున్నాయి’ అని జైట్లీ తెలిపారు. న్యాయశాఖ మంత్రిగా తనకు ఎదురైన అనుభవాల్ని వివరిస్తూ... సివిల్ ప్రొసీజర్ కోడ్‌ను సవరించినా ఎలాంటి మార్పు రాలేదన్నారు.