బెంగళూర్ : వేతన పెంపుపై యాజమాన్యంతో జరిగిన చర్చలు విఫలమవడంతో ప్రభుత్వ రంగ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)కు చెందిన 20,000 మంది ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. వేతన సవరణపై యాజమాన్యంతో జరిగిన చర్చలు ఫలప్రదం కాలేదని, తమ డిమాండ్లపై ఒత్తిడి పెంచేందుకు సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్‌ఏఎల్‌కు చెందిన తొమ్మిది కార్మిక సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్ చంద్రశేఖర్ వెల్లడించారు. కార్మిక చట్టాలకు అనుగుణంగా 15 రోజుల కిందటే తాము సమ్మె నోటీసు ఇచ్చామని చెప్పారు. మరోవైపు సమ్మెను నివారించేందుకు అన్ని ప్రయత్నాలు చేసినా కార్మికులు నిరవధిక సమ్మెకు పూనుకున్నారని హెచ్‌ఏఎల్ పేర్కొంది. కాగా హెచ్‌ఏఎల్‌కు చెందిన బెంగళూర్, హైదరాబాద్, కోరాపుట్, లక్నో, నాసిక్‌లోని 5 ప్రొడక్షన్ కాంప్లెక్స్‌ల్లో 20,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా హెచ్‌ఏఎల్‌కు 4 పరిశోధన అభివృద్ధి కేంద్రాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment