సీఆర్పీఎఫ్‌ క్యాంపుపై గ్రెనేడ్‌ దాడి | CRPF jawan injured in grenade attack | Sakshi
Sakshi News home page

సీఆర్పీఎఫ్‌ క్యాంపుపై గ్రెనేడ్‌ దాడి

Published Sun, Jul 9 2017 12:48 PM | Last Updated on Sat, Aug 11 2018 9:02 PM

CRPF jawan injured in grenade attack

శ్రీనగర్‌: సీఆర్పీఎఫ్‌ క్యాంపును లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు చేసిన గ్రెనేడ్‌ దాడిలో ఓ జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జమ్ము కశ్మీర్‌లోని పుల్వామ జిల్లా ట్రాల్‌లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణంలోని అరిబల్‌ ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌, సివిల్‌ పోలీసుల ఉమ్మడి క్యాంప్‌ పై గుర్తుతెలియని దుండగులు గ్రెనేడ్‌ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ సీఆర్పీఎఫ్‌ జవానుకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. హిజ్బుల్‌ కమాండర్‌ బుర్హాన్‌ వని తొలి వర్ధంతిని పురస్కరించుకొని ఈ ఉగ్రదాడి జరిపినట్లు హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ గ్రూప్ ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement