తెల్లవారితే పెళ్లి.. ఏటీఎం వద్దే ఆ ఫ్యామిలీ! | Delhi bridegroom family stands overnight at atm centers | Sakshi
Sakshi News home page

తెల్లవారితే పెళ్లి.. ఏటీఎం వద్దే ఆ ఫ్యామిలీ!

Published Tue, Nov 15 2016 8:26 AM | Last Updated on Mon, Sep 4 2017 8:10 PM

తెల్లవారితే పెళ్లి.. ఏటీఎం వద్దే ఆ ఫ్యామిలీ!

తెల్లవారితే పెళ్లి.. ఏటీఎం వద్దే ఆ ఫ్యామిలీ!

న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దుతో సామాన్యుల కష్టాలు రెట్టింపయ్యాయి. నిత్యావసర సరుకులు కొనేందుకు తమ చేతిలో డబ్బులు ఉన్న కొనలేని పరిస్థితి కొందరిదైతే.. అసలు తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకునేందుకు వీలు దొరకడం లేదని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల కిందట రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ ఈ నోట్ల రద్దుతో ఆత్మహత్యలతో పాటు గుండెపోటు మరణాలు సంభవించాయి. దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. వాడుకలో ఉన్న నోట్లను డ్రా చేసుకునేందుకు ఏటీఎం కేంద్రాలకు వెళ్లిన వాళ్లకు ఓ పెళ్లికొడుకు కుటుంబం తన అసహనాన్ని వెళ్లగక్కింది.

సాధారణంగా ఇంట్లో ఉంటే పెళ్లికొడుకుతో పాటు ఆ ఇంటిళ్లిపాది పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయింది. కనీసం పెళ్లి ఖర్చులకైనా ఎంతో కొంత మనీ చేతిలో ఉండాలి కదా. అందుకోసం వరుడు సునీల్‌తో పాటు అతడి ఇద్దరు సోదరులు సోమవారం అర్ధారత్రి నుంచి మంగళవారం ఉదయం వరకూ ఏటీఎం సెంటర్ వద్దే గడపాల్సి వచ్చింది. మరుసటి రోజు(మంగళవారం) పెళ్లి ఉన్నా కూడా ఇలాంటి ఇబ్బందులు తప్పడం లేదని వరుడు సునీలో జాతీయ మీడియాతో చెప్పాడు. ఢిల్లీలోని భంజాన్ పుర ప్రాంతంలోని రెండు ఏటీఎం కేంద్రాల వద్ద పెళ్లి సమయంలో తమ కుటుంబం మనీ కోసం కష్టాలు పడ్డ తగిన ఫలితం రాలేదని వాపోయాడు. కొత్తనోట్లు మరింతగా వాడుకలోకి తెచ్చి ప్రజలకు అందుబాటులో ఉంటే ఈ సమస్యలు తగ్గుముఖం పడతాయని సునీలో అభిప్రాయపడ్డాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement