cash demonetization
-
నగదు మార్చుకోగానే ఇంక్ మార్క్!
-
నగదు మార్చుకోగానే ఇంక్ మార్క్!
ఢిల్లీ: పెద్దనోట్ల రద్దు వల్ల కొంతమంది వ్యక్తులు బ్యాంకులకు వెళ్లి పదే పదే డబ్బులు మారుస్తున్నారని కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ తెలిపారు. కొందరు వ్యక్తులు ఈ విధంగా పదే పదే బ్యాంకులకు రావడంతో ఇతరులకు అవకాశం లేకుండా చేస్తున్నారని.. దీన్ని నిరోధించడంలో భాగంగా ఇంక్ మార్క్ వేయనున్నట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. కొందరు వ్యక్తులు పదే పదే రావడం వల్లే బ్యాంకుల వద్ద రద్దీ బాగా పెరిగిందని, నల్లధనం ఉన్న వ్యక్తులు పెద్ద సంఖ్యలో వ్యక్తులను బ్యాంకులకు పంపిస్తున్నారని శక్తికాంత్ దాస్ చెప్పారు. జన్‌ధన్ అకౌంట్లలో రూ.50 వేలు వరకు మాత్రమే డిపాజిట్ చేయవచ్చు అన్నారు. 'నకిలీ నోట్ల నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటుచేశాం. బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో నగదు పంపిణీ పెంచాం. కొన్ని సంస్థలు సమ్మెలోకి వెళ్తున్నాయంటూ వచ్చిన వదంతులను నమ్మవద్దు. జన్‌ధన్ యోజన అకౌంట్లపై దృష్టి పెడుతున్నాం' అని ఆర్థికశాఖ కార్యదర్శి పేర్కొన్నారు.ప్రాథమిక అవసరాలకు తమ వద్ద ఉన్న పాత కరెన్సీని మార్చుకునేందుకు బ్యాంకులకు తరలివస్తున్న జనాలకు ఇక్కట్లు తప్పడం లేదు. బ్యాంకుల వద్ద పెద్ద సంఖ్యలో జనాలు ఉండటంతో సమయం వృథా అవుతుందని వాపోతున్నారు. బ్యాంకుల్లో రోజుకు రూ.4000 నుంచి రూ.4500 కు పాతకరెన్సీని మార్చుకునే వెసలుబాటు ఉంది. -
తెల్లవారితే పెళ్లి.. ఏటీఎం వద్దే ఆ ఫ్యామిలీ!
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దుతో సామాన్యుల కష్టాలు రెట్టింపయ్యాయి. నిత్యావసర సరుకులు కొనేందుకు తమ చేతిలో డబ్బులు ఉన్న కొనలేని పరిస్థితి కొందరిదైతే.. అసలు తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకునేందుకు వీలు దొరకడం లేదని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల కిందట రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ ఈ నోట్ల రద్దుతో ఆత్మహత్యలతో పాటు గుండెపోటు మరణాలు సంభవించాయి. దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. వాడుకలో ఉన్న నోట్లను డ్రా చేసుకునేందుకు ఏటీఎం కేంద్రాలకు వెళ్లిన వాళ్లకు ఓ పెళ్లికొడుకు కుటుంబం తన అసహనాన్ని వెళ్లగక్కింది. సాధారణంగా ఇంట్లో ఉంటే పెళ్లికొడుకుతో పాటు ఆ ఇంటిళ్లిపాది పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయింది. కనీసం పెళ్లి ఖర్చులకైనా ఎంతో కొంత మనీ చేతిలో ఉండాలి కదా. అందుకోసం వరుడు సునీల్‌తో పాటు అతడి ఇద్దరు సోదరులు సోమవారం అర్ధారత్రి నుంచి మంగళవారం ఉదయం వరకూ ఏటీఎం సెంటర్ వద్దే గడపాల్సి వచ్చింది. మరుసటి రోజు(మంగళవారం) పెళ్లి ఉన్నా కూడా ఇలాంటి ఇబ్బందులు తప్పడం లేదని వరుడు సునీలో జాతీయ మీడియాతో చెప్పాడు. ఢిల్లీలోని భంజాన్ పుర ప్రాంతంలోని రెండు ఏటీఎం కేంద్రాల వద్ద పెళ్లి సమయంలో తమ కుటుంబం మనీ కోసం కష్టాలు పడ్డ తగిన ఫలితం రాలేదని వాపోయాడు. కొత్తనోట్లు మరింతగా వాడుకలోకి తెచ్చి ప్రజలకు అందుబాటులో ఉంటే ఈ సమస్యలు తగ్గుముఖం పడతాయని సునీలో అభిప్రాయపడ్డాడు.