సాక్షి, న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో సీఏఏ అల్లర్లపై న్యాయస్దానం బుధవారం తీవ్రంగా స్పందించింది. దేశంలో మరో 1984 ఘటనలను పునరావృతం కానివ్వబోమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈశాన్య ఢిల్లీలో ఐబీ అధికారి మృతదేహం లభ్యం కావడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఇది దురదృష్టకర ఘటన అని అభివర్ణించిన కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు తక్షణమే బాధితులు, బాధిత కుటుంబాలను కలుసుకోవాలని ఆదేశించింది.
బాధితులకు సాయం అందించేందుకు హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేయాలని, బాధితులను ఆస్పత్రులు, సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రైవేట్ అంబులెన్స్‌లను ఏర్పాటు చేయాలని అధికారలను ఆదేశించింది. బాధితుల కోసం కనీస సదుపాయాలతో కూడిన పునరావాస షెల్టర్లను ఏర్పాటు చేయాలని కోరింది. అల్లర్ల ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల్లో విశ్వాసం నెలకొల్పేందుకు ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎంలు ఆయా ప్రాంతాల్లో పర్యటించాలని కోర్టు ఆదేశించింది. కాగా ఢిల్లీ అల్లర్లలో ఇప్పటివరకూ 17 మంది మరణించారని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment