
న్యూఢిల్లీ : జామియా విశ్వవిద్యాలయ విద్యార్థి, కార్యకర్త సఫూరా జర్గర్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈశ్యాన్య ఢిల్లీ అల్లర్ల కేసులో గర్భిణి అయిన సఫూరాను ఢిల్లీ పోలీసులు ఉగ్రవాద నిరోధక చట్టం(ఉపా) కింద అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా స్టిస్ రాజీవ్ షాక్ధర్ ఈ పిటిషన్ విచారణను చేపట్టారు. సఫూరా జర్గర్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై మంగళవారం ఢిల్లీ పోలీసుల తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యంతరం తెలపకపోవడంతో ఢిల్లీ హైకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. (సుశాంత్ కుక్క మరణం: నిజమేనా?)
అయితే ఢిల్లీ అల్లర్ల కేసు దర్యాప్తుకు ఆటంకం కలిగించే ఏ చర్యలకు పాల్పడవద్దని హైకోర్టు సఫూరా జర్గర్‌ను ఆదేశించింది. ఢిల్లీ విడిచి వెళ్లవద్దని, ఒకవేళ వెళ్లాలి అనుకుంటే కోర్టు అనుమతి తీసుకోవాలని ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తు అధికారిని కనీసం 15 రోజులకొకసారి ఒక్కసారి ఫోన్‌లో సంప్రదించాలని కోర్టు ఆదేశించింది. జేఎమ్ఐలో ఎంఫిల్ విద్యార్థి అయిన సంఫూరా జామియా కోఆర్డినేషన్ కమిటీ సభ్యురాలు. అంతేగాక ఆమె ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణి. ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో ఏప్రిల్‌లో సఫూరాను పోలీసులు అరెస్టు చేశారు. (ఢిల్లీ పోలీసులకు రాష్ట్ర హైకోర్టు క్లాస్!)
Comments
Please login to add a commentAdd a comment