న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ఎవ్వరికీ కేటాయించని గుర్తుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఎయిర్ కండిషనర్, బ్యాట్, కార్పెట్, చెప్పులు, బ్రెడ్, బెలూన్, కిటికీ, కొబ్బరికాయ, కాలీఫ్లవర్, బ్యాటరీ, కేక్, బకెట్, అలారమ్, క్యారమ్ బోర్డ్, తదితర 84 గుర్తులు ఉన్నాయి. వీటి నుంచి కొత్త పార్టీలకు గుర్తులను ఇవ్వనుంది. ఎన్నికల సంఘం (రిజర్వేషన్, కేటాయింపుల చట్టం-1968) కింద పార్టీలకు గుర్తులను కేటాయిస్తుంది. ‘రిజర్వుడ్ సింబల్స్’ను ఈసీ గుర్తింపు పొందిన పార్టీలకు మాత్రమే ఇస్తుంది.
ఈ గుర్తులపై ఆపార్టీ అభ్యర్థులంతా పోటీ చేయవచ్చు . ఎవ్వరికీ కేటాయించని(ఫ్రీసింబల్స్) గుర్తులను తన వద్ద కొత్తగా రిజిస్టర్ చేసుకున్న పార్టీలకు కేటాయిస్తుంది. ప్రస్తుతం ఈసీ దగ్గర 1,737 పార్టీలు రిజిస్టర్ చేసుకోగా వాటిలో అన్ని పార్టీలు గుర్తింపు పొందలేదు. కాంగ్రెస్, బీఎస్పీ, బీజేపీ,సీపీఐ,సీపీఐ(ఎమ్), ఎన్సీపీలకు మాత్రమే జాతీయ పార్టీలుగా గుర్తింపు ఉంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఎస్పీ, ఇక్కడి తెలుగుదేశం పార్టీలకు మాత్రం ఒకే గుర్తు సైకిల్ ఉంది.
84 ఫ్రీ సింబల్స్ ప్రకటించిన ఈసీ
Published Sat, Jan 17 2015 2:04 AM | Last Updated on Sat, Sep 2 2017 7:46 PM
Advertisement
Advertisement