దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పెరిగిపోతున్నాయి. సోమవారం నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత ఏకంగా 44 డిగ్రీలుగా నమోదైంది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పెరిగిపోతున్నాయి. సోమవారం నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత ఏకంగా 44 డిగ్రీలుగా నమోదైంది. ఈ సీజన్‌లో ఇంతవరకు ఇదే అత్యధికం. కనిష్ఠ ఉష్ణోగ్రత 23.8 డిగ్రీలుగా నమోదైంది. ఉదయం 8.30 గంటల సమయంలో గాలిలో తేమ 21 శాతం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
సాయంత్రం తర్వాత వాతావరణం చల్లబడిందని, రాత్రికి గాలి దుమ్ము రావడం లేదా చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని, నగరం పలుచోట్ల మేఘావృతమై ఉంటుందని కూడా చెప్పారు. అయితే వాతావరణాన్ని చల్లబరిచేంత వర్షం మాత్రం కురవకపోవచ్చంటున్నారు. ఆదివారం నాడు ఢిల్లీలో గరిష్ఠ ఉష్ణోగ్రత 42 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22 డిగ్రీలుగా నమోదైంది.