highest temperature
-
భానుడి ఉగ్రరూపానికి అల్లాడుతున్న ప్రజలు
-
ఏపీలో మండుతున్న ఎండలు
-
తూర్పుగోదావరి జిల్లాకు ఇస్రో హెచ్చరిక!
-
తూర్పుగోదావరి జిల్లాకు ఇస్రో హెచ్చరిక!
పచ్చటి కొబ్బరిచెట్లు, ప్రతి ఊళ్లోనూ కాలువలు, చల్లటి పిల్లగాలి వీచే తూర్పుగోదావరి జిల్లాలో రాబోయే మూడు నాలుగు రోజుల్లో మాత్రం ఉష్ణోగ్రతలు అదిరిపోతాయట. ఈ విషయం చెప్పింది కూడా వాళ్లూ, వీళ్లు కాదు.. స్వయానా ఇస్రో అధికారులు. తూర్పు గోదావరి జిల్లాలో రాబోయే మూడు నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతాయని, అవి 52 డిగ్రీల వరకు కూడా వెళ్లే అవకాశం ఉందని ఇస్రో హెచ్చరించినట్లు జిల్లా కలెక్టర్ కార్తికేయ తెలిపారు. ప్రధానంగా కోనసీమ ప్రాంతంలోని అమలాపురం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం మండలాలతో పాటు కాకినాడ సమీపంలోని ఉప్పాడ కొత్తపల్లి మండలంలో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని కలెక్టర్ కార్తికేయ చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వీలైనంత వరకు బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలని ఆయన తెలిపారు. -
‘భద్రాద్రి’ భగభగ
-
‘భద్రాద్రి’ భగభగ
నిప్పుల కొలిమిని తలపిస్తున్న కొత్తగూడెం జిల్లా భద్రాచలం, పాల్వంచ, దుమ్ముగూడెంలో 44 డిగ్రీలు రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు మే నెలలో 47 డిగ్రీలకు చేరుకోనున్న ఉష్ణోగ్రతలు తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మంగళవారం నిప్పుల కొలిమిని తలపించింది. జిల్లాలోని భద్రాచలంలో 44.2 డిగ్రీలు, పాల్వంచ మండలం యానాంబైలు గ్రామంలో 44.1 డిగ్రీలు, దుమ్ముగూడెంలో 44 డిగ్రీలు, భద్రాచలం రూరల్‌లో 43.9 డిగ్రీలు, ఖమ్మం జిల్లా వైరాలో 44 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మహబూబ్‌నగర్‌లో 42.6, ఖమ్మంలో 42.2, నల్లగొండ, నిజామాబాద్‌లలో 41 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి తెలిపారు. గత పదేళ్లలో ఏప్రిల్ 11 నాటికి ఏనాడూ 44 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరలేదని వెల్లడించారు. ఏప్రిల్ మూడో వారంలో నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు ఇప్పుడే రికార్డు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 2010 ఏప్రిల్ 23న హన్మకొండలో 44.3, గతేడాది ఏప్రిల్ 22న మెదక్‌లో 44.2 డిగ్రీలు, 26న మహబూబ్‌నగర్‌లో 44.2 డిగ్రీలు నమోదయ్యాయి. ఇంతకన్నా ముందుగా ఎక్కడా 44 డిగ్రీలు నమోదు కాలేదని వాతావరణ శాఖ తెలిపింది. మే నెల ఎండ ప్రచండమే వచ్చే నెల వడగాడ్పుల తీవ్రత మరింతగా ఉంటుందని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. మే నెలలో గరిష్టంగా 47 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుతాయని, దీంతో వడగాడ్పులు తీవ్రంగా వీస్తాయని తెలిపింది. ఈ మేరకు విపత్తు నిర్వహణ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరింది. సాధారణ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు నాలుగైదు డిగ్రీలు ఎక్కువగా అంటే వడగాడ్పులుగా లెక్కిస్తారని, ఆరు డిగ్రీల కన్నా అధికంగా ఉంటే తీవ్ర వడగాడ్పులుగా ప్రకటిస్తారని చెప్పింది. వడగాడ్పులు ఉన్నప్పుడు వేసవి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని, లేదంటే ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపనుందని హెచ్చరించింది. విపత్తు నిర్వహణ శాఖ సూచనలు ఆరుబయట పని చేసే ఉపాధి కూలీ పనులను ఉదయం వేళల్లోనే చేయించాలి. వడగాడ్పుల సమయంలో ప్రయాణాలను మానుకోవాలి. బస్సు వేళల్లోనూ మార్పులు చేయాలి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బస్సులు నడపకూడదని వేసవి ప్రణాళికలో విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు జిల్లాల్లోనూ వేసవి ప్రణాళికలు అమలు చేస్తున్నారని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. -
ఠారెత్తించిన భానుడు.. రికార్డు టెంపరేచర్
- భద్రాద్రిలో ఎండ మండింది! హైదరాబాద్: తెలంగాణలో వేసవి ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతోంది. మంగళవారం భద్రాచలం పట్టణంలో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. రాష్ట్రంలోనే ఇది అత్యధికం కావటం గమనార్హం. యానంబైలు గ్రామంలోనూ 44.1 డిగ్రీలు ఉంది. ఈ రెండూ భదాద్రి కొత్తగూడెంలోనివే. దీంతోపాటు వైరాలో 44, మహబూబ్‌నగర్ 42.6, ఖమ్మంలో 42.2, ఆదిలాబాద్ 41.3, హైదరాబాద్‌లో 40 డిగ్రీలు నమోదయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ తీవ్రత ఇలాగే కొనసాగుతుందని పేర్కొంది. సాధారణ స్థాయి కంటే రెండు లేదా మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. -
రాజధానిలో ఎండ మంటలు!
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పెరిగిపోతున్నాయి. సోమవారం నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత ఏకంగా 44 డిగ్రీలుగా నమోదైంది. ఈ సీజన్లో ఇంతవరకు ఇదే అత్యధికం. కనిష్ఠ ఉష్ణోగ్రత 23.8 డిగ్రీలుగా నమోదైంది. ఉదయం 8.30 గంటల సమయంలో గాలిలో తేమ 21 శాతం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సాయంత్రం తర్వాత వాతావరణం చల్లబడిందని, రాత్రికి గాలి దుమ్ము రావడం లేదా చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని, నగరం పలుచోట్ల మేఘావృతమై ఉంటుందని కూడా చెప్పారు. అయితే వాతావరణాన్ని చల్లబరిచేంత వర్షం మాత్రం కురవకపోవచ్చంటున్నారు. ఆదివారం నాడు ఢిల్లీలో గరిష్ఠ ఉష్ణోగ్రత 42 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22 డిగ్రీలుగా నమోదైంది. -
సూర్య@ 38.2 డిగ్రీలు
ఆరేళ్ల తరవాత ఇదే అత్యధికం సాక్షి, హైదరాబాద్: ఫిబ్రవరి నెలలోనే భానుడి భగభగలతో సిటీజనులు విలవిల్లాడుతున్నారు. మండు వేసవిని తలపిస్తున్న ఎండలతో సొమ్మసిల్లుతున్నారు. ఈ సీజన్లోనే అత్యధికంగా ఆదివారం 38.2 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆరేళ్ల తరవాత ఇదే అత్యధికం. 2009 ఫిబ్రవరి 26న గ్రేటర్లో 39.1 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే ఇప్పటివరకు ఫిబ్రవరి నెలలో ఆల్‌టైమ్ రికార్డు. ఆ తరవాత ఫిబ్రవరి నెలలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే కావడం గమనార్హం. కాగా దక్షిణాది నుంచి సముద్రంపై నుంచి వీస్తున్న వేడిగాలుల కారణంగానే ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయని బేగంపేటలోని వాతావరణ శాఖ తెలిపింది. మరో నెలరోజుల పాటు ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో నమోదవుతాయని తెలిపింది. కాగా ఉష్ణోగ్రతలతోపాటు గాలిలో తేమ శాతం పగటి వేళల్లో 29 శాతానికి పడిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు సొమ్మసిల్లుతున్నారు. రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రతల్లో స్వల్ప హెచ్చుతగ్గులుంటాయని వాతావరణ శాఖ తెలిపింది. -
మండుతున్న మంచుకొండ!!
మంచుకొండలు మండిపడుతున్నాయి. నిప్పు కణికలను కక్కుతున్నాయి. అవును.. జమ్ములో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఈ సీజన్లో ఇప్పటివరకు అత్యధికంగా 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత గురువారం నాడు నమోదైంది. ఇది సాధారణ ఉష్ణోగ్రత కంటే ఐదు డిగ్రీలు ఎక్కువని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జమ్ములో జూన్ నెలలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 47.2 డిగ్రీలు. ఇది 1953 జూన్ 12వ తేదీన నమోదైంది. ఆ తర్వాత ఎప్పుడూ ఇంత ఎక్కువ స్థాయిలో అక్కడ ఉష్ణోగ్రత లేదు. బహుశా ఈ సంవత్సరం దాన్ని దాటిపోవచ్చేమోనన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో జమ్ములో ఇలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందని, కొంతమేర ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఈ ఉష్ణోగ్రత కారణంగా ఎప్పుడూ పర్యాటకులతో కళకళలాడుతుండే జమ్ము ఈసారి మాత్రం వెలవెలబోతోంది.