ఠారెత్తించిన భానుడు.. రికార్డు టెంపరేచర్
- భద్రాద్రిలో ఎండ మండింది!
హైదరాబాద్: తెలంగాణలో వేసవి ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతోంది. మంగళవారం భద్రాచలం పట్టణంలో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. రాష్ట్రంలోనే ఇది అత్యధికం కావటం గమనార్హం. యానంబైలు గ్రామంలోనూ 44.1 డిగ్రీలు ఉంది. ఈ రెండూ భదాద్రి కొత్తగూడెంలోనివే.
దీంతోపాటు వైరాలో 44, మహబూబ్‌నగర్ 42.6, ఖమ్మంలో 42.2, ఆదిలాబాద్ 41.3, హైదరాబాద్‌లో 40 డిగ్రీలు నమోదయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ తీవ్రత ఇలాగే కొనసాగుతుందని పేర్కొంది. సాధారణ స్థాయి కంటే రెండు లేదా మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.