తూర్పుగోదావరి జిల్లాకు ఇస్రో హెచ్చరిక! | east godavari may witness highest temperature, warns isro | Sakshi
Sakshi News home page

తూర్పుగోదావరి జిల్లాకు ఇస్రో హెచ్చరిక!

Published Sat, May 20 2017 3:07 PM | Last Updated on Thu, Mar 21 2019 7:25 PM

తూర్పుగోదావరి జిల్లాకు ఇస్రో హెచ్చరిక! - Sakshi

తూర్పుగోదావరి జిల్లాకు ఇస్రో హెచ్చరిక!

పచ్చటి కొబ్బరిచెట్లు, ప్రతి ఊళ్లోనూ కాలువలు, చల్లటి పిల్లగాలి వీచే తూర్పుగోదావరి జిల్లాలో రాబోయే మూడు నాలుగు రోజుల్లో మాత్రం ఉష్ణోగ్రతలు అదిరిపోతాయట. ఈ విషయం చెప్పింది కూడా వాళ్లూ, వీళ్లు కాదు.. స్వయానా ఇస్రో అధికారులు. తూర్పు గోదావరి జిల్లాలో రాబోయే మూడు నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతాయని, అవి 52 డిగ్రీల వరకు కూడా వెళ్లే అవకాశం ఉందని ఇస్రో హెచ్చరించినట్లు జిల్లా కలెక్టర్ కార్తికేయ తెలిపారు.

ప్రధానంగా కోనసీమ ప్రాంతంలోని అమలాపురం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం మండలాలతో పాటు కాకినాడ సమీపంలోని ఉప్పాడ కొత్తపల్లి మండలంలో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని కలెక్టర్ కార్తికేయ చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వీలైనంత వరకు బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement