ఆ రెండు చానళ్లపై 48 గంటల నిషేధం | Delhi Riots Coverage 48 Hour Ban On Two Malayalam Channels | Sakshi
Sakshi News home page

ఆ రెండు చానళ్లపై 48 గంటల నిషేధం

Published Fri, Mar 6 2020 9:42 PM | Last Updated on Sat, Mar 7 2020 12:18 AM

Delhi Riots Coverage 48 Hour Ban On Two Malayalam Channels - Sakshi

ఢిల్లీ అల్లర్లలో ద్వంసమైన వాహనం

న్యూఢిల్లీ : ఢిల్లీ అల్లర్లపై నిబంధనలకు విరుద్ధంగా ప్రసారాలు చేసినందుకు గాను రెండు మలయాళ చానళ్లపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 48 గంటల నిషేధం విధించింది. నిషేధానికి గురైనా వాటిలో ఏషియా నెట్‌, మీడియా వన్‌ చానళ్లు ఉన్నాయి. ఈ రెండు చానళ్లు రెండు వర్గాల మధ్య విద్వేషాలు పెంచేవిధంగా రిపోర్టింగ్‌ చేశాయని పేర్కొంది. నిబంధనలకు విరుద్దంగా ప్రసారాలు చేసినందుకు శుక్రవారం రాత్రి 7.30 గంటల నుంచి 48 గంటల పాటు ఆ రెండు చానళ్ల ప్రసారాలపై నిషేధించింది. అలాగే ఢిల్లీ అల్లర్ల కవరేజీకి సంబంధించి దేశవ్యాప్తంగా అన్ని చానళ్ల ప్రసారాలను సమచార శాఖ నిశితంగా పరిశీలిస్తుంది. 

కాగా, ఈశాన్య ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఫిబ్రవరి 23 న అల్లర్లు చేలరెగిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల పాటు సాగిన ఈ ఘర్షణల్లో 53 మంది మరణించగా.. 200 మందికి పైగా గాయపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement