ఆ రోడ్డెక్కితే రెండు గంటల్లో 270 కిలోమీటర్లు..
న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి జైపూర్కు వెళ్లే సమయం అనూహ్యంగా తగ్గిపోనుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్న దూరం 270 కిలోమీటర్లను కేవలం రెండు గంటల్లో పూర్తి చేసేలా జాతీయ రహదారిని విస్తరించనున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.
ఇందుకోసం రూ.16,500 కోట్లు ఖర్చుచేయనున్నామని అన్నారు.ఇప్పటికే భూసేకరణ పనులు పూర్తయ్యాయని, 2017 జనవరిలో రోడ్డు నిర్మాణ పనులు మొదలుపెడతామని చెప్పారు. ఈ రహదారిపై అతి వేగంతో ప్రయానించేవారిని గుర్తించేందుకు రహదారి వెంట సీసీటీవీ కెమెరాలను అమర్చనున్నట్లు తెలిపారు.