
లక్నో : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి హిందూ మతంపై గౌరవం లేదని యూపీ డిప్యూటీ సీఎం దినేష్ శర్మ ఆరోపించారు. సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను కాషాయ వస్త్రాలు ధరిస్తారంటూ ప్రియాంక చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. హిందూ ధర్మం హింసను, ప్రతీకారాన్ని ప్రేరేపించదని చెప్పేందుకు సంకేతమైన కాషాయ వస్త్రానికి యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ న్యాయం చేయడం లేదని ప్రియాంక వ్యాఖ్యానించిన నేపథ్యంలో దినేష్ శర్మ ఆమెకు దీటుగా బదులిచ్చారు. విపక్షాలు హింసను ప్రేరేపిస్తున్నాయని అన్నారు.
ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ ఘర్షణలకు పాల్పడే వారికీ మద్దతు పలుకుతున్నారని మండిపడ్డారు. కాగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్న నిరసనకారులను యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ అణిచివేతకు గురిచేస్తున్నారని ప్రియాంక ఆరోపిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. పౌర చట్టంపై నిరసనల నేపథ్యంలో ప్రతీకారం తప్పదని ఆయన హెచ్చరించడాన్ని ఆమె తప్పుపట్టారు. హిందూ మతం హింసను, ప్రతీకారాన్ని హిందూ మతం కోరుకోదని ప్రియాంక చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment