న్యూఢిల్లీ: గుజరాత్‌లోని కేవదియాలో జరుగుతున్న డీజీపీ, ఐజీపీల వార్షిక సదస్సులో ప్రధాని మోదీ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు పాటిస్తున్న భద్రతా విధానాలు, పోలీసింగ్‌ను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. ‘ శనివారం కూడా అధికారులతో ప్రధాని చర్చలు కొనసాగనున్నాయి. అలాగే ఈ సమావేశాల నేపథ్యంలో జాతీయ పోలీస్ స్మారకం స్టాంప్‌ను, సైబర్ కోఆర్డినేషన్ సెంటర్‌ను మోదీ ప్రారంభించనున్నారు. విధుల్లో విశేష ప్రతిభ చూపిన ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) అధికారులకు ప్రెసిడెన్షియల్ పోలీస్ మెడల్స్‌ను ప్రదానం చేస్తారు. ఈ సదస్సుకు హాజరైన సభికుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు’ అని ప్రధాని కార్యాలయం ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment