పాకిస్థాన్కు ఒక రోజు ముందే స్వాతంత్ర్యం? | did pakistan get independence a day before than india | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్కు ఒక రోజు ముందే స్వాతంత్ర్యం?

Published Fri, Aug 15 2014 9:38 AM | Last Updated on Sat, Sep 2 2017 11:55 AM

పాకిస్థాన్కు ఒక రోజు ముందే స్వాతంత్ర్యం?

పాకిస్థాన్కు ఒక రోజు ముందే స్వాతంత్ర్యం?

బ్రిటిష్ వాళ్ల దాస్యశృంఖలాలను తెంచుకుని భారతదేశం స్వతంత్ర దేశంగా మారింది. అయితే, అదే సమయంలో పాకిస్థాన్ మాత్రం మన దేశం నుంచి విడిపోయి ప్రత్యేక దేశంగా రూపొందింది. అప్పటినుంచి మనం ఆగస్టు 15వ తేదీని స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకొంటున్నాం. కానీ పాకిస్థాన్ మాత్రం ఆగస్టు 14వ తేదీనే స్వాతంత్ర్య వేడుకలు చేసుకుంటోంది. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ పాకిస్థాన్కు మనకంటే ముందే స్వాతంత్ర్యం వచ్చిందా? రెండింటికీ ఒకేసారి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు.. ఆ దేశం ఎందుకు ఒక రోజు ముందే వేడుకలు చేసుకుంటుంది? ఈ విషయం ఎప్పుడైనా ఆలోచించారా?

''నా హృదయం ఆనందోత్సాహాలతో నిండిపోయింది. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆగస్టు 15వ తేదీ స్వతంత్ర, సర్వసత్తాక పాకిస్థాన్ జన్మదినం. గత కొన్నేళ్లుగా మన సొంత దేశాన్ని పొందడానికి అనేక అద్భుతమైన త్యాగాలు చేసిన ఫలితంగానే ఈ ముస్లిం దేశం అనే లక్ష్యాన్ని చేరుకోగలిగాం'' అని పాకిస్థాన్ తొలి గవర్నర్ జనరల్ మహ్మద్ అలీ జిన్నా తన స్వాతంత్ర్య సందేశం ఇచ్చారు. ఆయన కూడా ఆగస్టు 15 అనే చెప్పినా, పాకిస్థాన్ మాత్రం ఇప్పటికీ 14వ తేదీనే ఉత్సవాలు చేసుకుంటోంది.

ఎందుకంటే.. 1948 సంవత్సరంలో ఆగస్టు 15వ తేదీన రంజాన్ వచ్చింది. దాంతో అప్పటి ప్రభుత్వం స్వాతంత్ర్య వేడుకలను ఒక రోజు ముందుకు జరిపింది. అప్పటినుంచి పాకిస్థాన్ అదే రోజును స్వాతంత్ర్య దినోత్సవంగా చేసుకుంటోంది. 1947లో ఆగస్టు 15వ తేదీ రంజాన్ మాసంలో వచ్చే చివరి శుక్రవారం.. జుమాత్ ఉల్ విదా అయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement