ఇండియాతో పెట్టుకోవద్దు.. జాగ్రత్త! | donot mess with indian army, says wrestler sushil kumar | Sakshi
Sakshi News home page

ఇండియాతో పెట్టుకోవద్దు.. జాగ్రత్త!

Published Fri, Sep 30 2016 10:10 AM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM

ఇండియాతో పెట్టుకోవద్దు.. జాగ్రత్త!

ఇండియాతో పెట్టుకోవద్దు.. జాగ్రత్త!

నియంత్రణ రేఖను దాటి వెళ్లి పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో సర్జికల్ స్ట్రైక్స్ చేసిన భారత సైన్యంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని రంగాలకు చెందినవాళ్లు సైన్యాన్ని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. తాజాగా ఈ జాబితాలో భారతీయ రెజ్లర్, ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ చేరాడు. భారత సైన్యంతో పెట్టుకోవద్దు జాగ్రత్త అంటూ పాకిస్థాన్‌ను హెచ్చరించాడు. ఈ మేరకు శుక్రవారం ఉదయం సుశీల్ కుమార్ ఒక ట్వీట్ చేశాడు. 'భారతీయ్ సేనా సే పంగా మత్ లేనా.. జైహింద్' అని హిందీలో కూడా పేర్కొన్నాడు. ఇంతకుముందు వీరేంద్ర సెహ్వాగ్, యోగేశ్వర్ దత్, విజేందర్ సింగ్ కూడా ఈ సర్జికల్ స్ట్రైక్స్ మీద తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. తాజాగా సుశీల్ కుమార్ కూడా వారి సరసన చేరాడు.

మరోవైపు బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్ కూడా ఈ అంశంపై స్పందించి ట్వీట్ చేశాడు. ప్రతి ఒక్క భారతీయుడి ప్రాణం ఎంతో విలువైందని నిరూపించిన భారతీయ సైన్యానికి హ్యాట్సాఫ్ అంటూ తన ట్వీట్‌లో అజయ్ దేవ్‌గణ్ పేర్కొన్నాడు. పలు సినిమాల్లో పోలీసు పాత్రలతో పాటు సైనిక పాత్రలు కూడా ధరించిన అజయ్.. ఈ అంశంపై స్పందించాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement