'ఎండలో దీక్ష చేస్తే నల్లబడతారు' | dont protest under sun says parsekar | Sakshi
Sakshi News home page

'ఎండలో దీక్ష చేస్తే నల్లబడతారు'

Published Thu, Apr 2 2015 4:19 AM | Last Updated on Sat, Sep 2 2017 11:42 PM

'ఎండలో దీక్ష చేస్తే నల్లబడతారు'

'ఎండలో దీక్ష చేస్తే నల్లబడతారు'

‘మండుటెండలో నిరాహార దీక్ష చేస్తే నల్లబడతారు. అది మీ పెళ్లికి ఇబ్బందికరంగా మారుతుంది’ అంటూ ఆందోళన చేస్తున్న నర్సులను ఉద్దేశించి గోవా సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

గోవా  అంబులెన్స్ నర్సులు పలు డిమాండ్లతో నిరశన చేపట్టారు. మంగళవారం సీఎంను కలిశారు. ‘అప్పడు సీఎం.. అమ్మాయిలు ఎండలో కూర్చుంటే నల్లబడతారని, మంచి పెళ్లికొడుకును వెతుక్కోలేకపోతారని అన్నారు’ అని అనూష సావంత్ అనే నర్సు చెప్పారు.. దీంతో పర్సేకర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే తానలాంటి వ్యాఖ్యలేమీ చేయలేదని పర్సేకర్ చెప్పారు. ఆందోళన చేస్తున్న ఆ నర్సు తనకు ముందే పరిచయమని, ఎండలో కూర్చోవడం వల్ల ఆమె విభిన్నంగా కనబడడంతో.. ఆ విషయమే చెప్పానన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement