దేశభక్తిపై ఒత్తిడి చేయొద్దు | Don't test my patriotism at random places, says Kamal Haasan | Sakshi
Sakshi News home page

దేశభక్తిపై ఒత్తిడి చేయొద్దు

Published Thu, Oct 26 2017 6:30 AM | Last Updated on Thu, Oct 26 2017 6:30 AM

Don't test my patriotism at random places, says Kamal Haasan

తమిళసినిమా: దేశభక్తి గురించి ఎవరినీ ఒత్తిడి చేయకూడదని నటుడు కమలహాసన్‌ మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈయన ఈ మధ్య తరచూ సమాజంలో జరుగుతున్న అంశాలపై ట్విట్టర్‌లో స్పందిస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా బుధవారం కూడా జాతీయగీతం వ్యవహారంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సింగపూర్‌లో జాతీయగీతం ప్రసారం అవుతున్నట్లు మనదేశంలోనూ ప్రసారం చేయాలన్న అంశంపై కమల్‌ స్పందిస్తూ సింగపూర్‌లో అర్ధరాత్రుల్లో కూడా జాతీయగీతం ప్రసారం అవుతున్నట్లు మనదేశంలో దూరదర్శన్, టెలివిజన్లలో ప్రసారం చేసి అన్ని ప్రాంతాల్లోనే దేశభక్తిని ప్రదర్శించాలని ఒత్తిడి చేయకూడదన్నారు.

సింగపూర్‌ గురించి తరచూ ప్రస్తావించడానికి కారణం కొందరు విమర్శకులు చెప్పెదాన్ని బట్టి ఆక్కడి దయగుణం కలిగిన రాజ్యాధికారమే కారణంగా పేర్కొన్నారు. అది మనకు అవసరం లేదని కమల్‌ పేర్కొన్నారు.ఈ విషయంపై ఎలాంటి రచ్చ జరగనుందో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement