సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల వేళ జరుగుతున్న ఐటీ దాడుల్లో గుట్టల కొద్దీ నోట్ల కట్టలు వెలుగుచూస్తున్న నేపథ్యంలో రెవెన్యూ కార్యదర్శి, కేంద్ర పత్ర్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్‌తో ఈసీ మంగళవారం సమావేశం కానుంది. ఎన్నికల సమయంలో విపక్ష నేతలను టార్గెట్ చేస్తూ పాలక బీజేపీ తమను ఇబ్బందులు పెడుతోందని కాంగ్రెస్ చేసిన ఫిర్యాదులపై రెవెన్యూ కార్యదర్శి ఏబీ పాండే, సీబీడీటీ చైర్మన్ పీసీ మోదీలను ఈ భేటీలో ఈసీ వివరణ కోరనుంది.
మరోవైపు ఎన్నికల నేపథ్యంలో ఐటీ దాడులు తటస్థంగా ఉండాలని, వివక్షతో కూడిన దాడులు చేపట్టరాదని ఈసీ ఇప్పటికే ఆర్థిక మంత్రిత్వ శాఖకు సూచించింది. ఎన్నికల నేపథ్యంలో చేపట్టే ఐటీ దాడులపై తమ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరింది. మధ్యప్రదేశ్, కర్నాటక, తమిళనాడుల్లో ఇటీవల జరిగిన ఐటీ దాడులు రాజకీయ కుట్రలో భాగమని విపక్ష నేతలు ఆరోపించిన క్రమంలో ఈసీ ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment