ప్రేమించినందుకు నాలుక కోశాడు.. | Father slashes daughter's tongue for having affair | Sakshi
Sakshi News home page

ప్రేమించినందుకు నాలుక కోశాడు..

Published Sun, Dec 7 2014 11:39 AM | Last Updated on Sat, Sep 2 2017 5:47 PM

ప్రేమించినందుకు నాలుక కోశాడు..

ప్రేమించినందుకు నాలుక కోశాడు..

న్యూఢిల్లీ: ఓ తండ్రి కూతురి పట్ల కర్కశంగా వ్యవహరించాడు. ఓ అబ్బాయిని ప్రేమించిందనే కారణంతో కూతురి నాలుకను నాలుకను కోశాడు. పశ్చిమబెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లా దోలాహత్ పోలీస్ స్టేసన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక ఓ అబ్బాయితో సన్నిహితంగా ఉండటం ఆమె తండ్రి మన్సూర్ అలీ లష్కర్కు కోపం తెప్పించింది. అతనికి దూరంగా ఉండాల్సిందిగా మన్సూర్ అలీ తన కూతురును పలుమార్లు హెచ్చరించాడు. కూతురు మాట వినకపోవడంతో ఆగ్రహం చెందిన మన్సూర్ అలీ కర్రతో ఆమె తలకు విచక్షణరహితంగా కొట్టాడు. కత్తి తీసుకుని ఆమె నాలుకను కోశాడు. తీవ్రంగా గాయపడి అపస్మారకస్థితిలోకి వెళ్లిన కూతురును పొలాల్లో పడేశాడు. గ్రామస్తులు బాలికను గుర్తించి ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పోలీసులు మన్సూర్ అలీతో అతని సహాయకులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement