slash
-
ఒక్క టాబ్లెట్‌తో గుండె జబ్బులు మాయం!
సాక్షి, న్యూఢిల్లీ : రోజుకు నాలుగు మందుల మిశ్రమం కలిగిన ఒక చిన్న టాబ్లెట్ వేసుకోవడం ద్వారా దేశంలో లక్షలాది మంది ప్రజల ప్రాణాలను కాపాడవచ్చని ఓ తాజా వైద్య అధ్యయనం వెల్లడించింది. తద్వారా ‘జాతీయ ఆరోగ్య స్కీమ్’ కింద ప్రభుత్వానికి ఖర్చవుతున్న కోట్లాది రూపాయలను ఆదా చేయవచ్చని కూడా ఆ అధ్యయనం సూచించింది. ఆస్ప్రిన్, స్టాటిన్ మందులతోపాటు రక్తపోటును నియంత్రించే ఏవైనా రెండు మందులతో కూడిన ‘పోలి పిల్’ వేసుకుంటే గుండెపోటు రాకుండా చేయవచ్చని అధ్యయనం జరిపిన వైద్యులు చెబుతున్నారు. గుండె జబ్బులు ఉన్నవారే కాకుండా ఎలాంటి గుండె జబ్బులు లేని వారు కూడా ఈ ‘పోలి పిల్’ వేసుకుంటే వారిలో 40 శాతం వరకు గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందని వారు చెప్పారు. పలు మందుల మిశ్రమ‘ పోలి పిల్స్’ గురించి గత కొన్నేళ్లుగా బ్రిటన్‌లో అధ్యయనాలు కొనసాగుతున్నా తాజా అధ్యయనమే సత్ఫలితాలిచ్చాయని వైద్యులు తెలిపారు. పైగా ఒక్క ట్యాబ్లెట్‌కు భారతీయ కరెన్సీలో కేవలం రెండు రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందని వారు చెప్పారు. 50 ఏళ్ల నుంచి 75 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన ఏడువేల మందిపై ఐదేళ్లపాటు అధ్యయనం జరపడం వల్ల ఈ ‘ పోలి పిల్’ ప్రభావాన్ని అధ్యయనం చేయగలిగామని వైద్యులు ‘ది లాన్సెట్’ పత్రికలో వివరించారు. దేశంలోని లక్షలాది మంది ప్రజలు ఇప్పటికే ‘స్టాటిన్ ట్యాబ్లెట్ల’తోపాటు బీపీ మందులు వాడుతున్నారని, వారు అనేక మందులు తీసుకునే బదులు రోజుకో ట్యాబ్లెట్ తీసుకుంటే సరిపోతుందని అధ్యయనంలో పాల్గొన్న బర్మింగమ్ యూనివర్శిటీ చెందిన ప్రొఫెసర్ టామ్ మార్శల్ తెలిపారు. ఎలాంటి గుండె జబ్బులు లేకుండా 50 ఏళ్ల వయస్సు దాటిని వారంతా ఈ ‘పోలి పిల్’ వాడడం వల్ల గుండె జబ్బులను అరికట్టవచ్చని ఆయన చెప్పారు. -
స్లాస్, త్రీఆర్ పరీక్షలను సమర్థంగా నిర్వహించండి
కంబాలచెరువు : రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 16, 17 తేదీల్లో నిర్వహిస్తున్న 'స్లాస్' 'త్రీ ఆర్ 'పరీక్షలను సమర్థంగా నిర్వహించాలని రాజమహేంద్రవరం ఉపవిద్యాశాఖాధికారి ఎస్.అబ్రహాం తెలిపారు. స్థానిక కోటగుమ్మం వద్ద నున్న మండలవనరుల కేంద్రంలో ఉపాధ్యాయుల సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు చదవడం, రాయడం, గణితభావనల స్థాయిని అంచనావేసేందుకు ఈ పరీక్షలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రశ్నాపత్రాలను పరీక్షకు ఒక గంటముందు ఆయా స్కూల్‌కాంప్లెక్స్‌లనుంచి తీసుకోవాలన్నారు. స్కూలు కాంప్లెక్స్ చైర్మన్లు వారి పరిధిల్లోని అన్ని స్కూల్స్ పరీక్షించి నివేదిక ఇవ్వాలన్నారు. ప్రశ్నాపత్రాలు తక్కువ అయినచో మండలవిద్యాశాఖాధికారిని సంప్రదించాలని, ఎట్టిపరిస్థితుల్లో జిరాక్స్ తీయరాదన్నారు. కార్యక్రమంలో అర్బన్ స్కూల్స్ డీఐ అయ్యంకి తులసీదాస్, వై.వేణుగోపాలరావు, శ్రీనివాస్, ప్రసాద్, నీలిమ, ఇందిర, కుమారి పాల్గొన్నారు. పరీక్షలు వాయిదా భానుగుడి(కాకినాడ) : జిల్లాలో ప్రాథమిక పాఠశాలల్లో ఈ నెల 14,15 తేదీలలో జరగాల్సిన స్లాష్, త్రీఆర్‌ఎస్ పరీక్షలను ఈనెల 16,17 తేదీలకు వాయిదా వేసినట్టు డీఈఓ ఆర్.నరసింహారావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షల ప్రశ్నపత్రాలను ఎంఈవోలకు పంపామని, ఈనెల 15న ఎంఈవోలు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు పరీక్షలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. శాంపిల్ సర్వే పాఠశాలలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు డీసీఈబీల ద్వారా ఎంఈవోలకు పంపనున్నట్టు తెలిపారు. -
ప్రేమించినందుకు నాలుక కోశాడు..
న్యూఢిల్లీ: ఓ తండ్రి కూతురి పట్ల కర్కశంగా వ్యవహరించాడు. ఓ అబ్బాయిని ప్రేమించిందనే కారణంతో కూతురి నాలుకను నాలుకను కోశాడు. పశ్చిమబెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లా దోలాహత్ పోలీస్ స్టేసన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక ఓ అబ్బాయితో సన్నిహితంగా ఉండటం ఆమె తండ్రి మన్సూర్ అలీ లష్కర్‌కు కోపం తెప్పించింది. అతనికి దూరంగా ఉండాల్సిందిగా మన్సూర్ అలీ తన కూతురును పలుమార్లు హెచ్చరించాడు. కూతురు మాట వినకపోవడంతో ఆగ్రహం చెందిన మన్సూర్ అలీ కర్రతో ఆమె తలకు విచక్షణరహితంగా కొట్టాడు. కత్తి తీసుకుని ఆమె నాలుకను కోశాడు. తీవ్రంగా గాయపడి అపస్మారకస్థితిలోకి వెళ్లిన కూతురును పొలాల్లో పడేశాడు. గ్రామస్తులు బాలికను గుర్తించి ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పోలీసులు మన్సూర్ అలీతో అతని సహాయకులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.