న్యూఢిల్లీ : మే 3 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్టు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటికే పలు మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. రెండో దశ లాక్‌డౌన్‌లో.. ఏప్రిల్ 20 తర్వాత కొన్ని రంగాలకు సడలింపు ప్రకటించింది. అయితే నిబంధనల సడలింపు వైరస్ హాట్ స్పాట్స్‌కు, కంటైన్మెంట్ జోన్స్‌కు వర్తించబోదని కేంద్రం స్పష్టం చేసింది. తాజాగా కేంద్రం లాక్‌డౌన్ కాలంలో మరిన్ని సడలింపులు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది.
కేంద్రం ప్రకటించిన సడలింపుల జాబితాలో ఉన్నవి..
- అటవీ ఉత్పత్తుల సేకరణ, ప్రాసెసింగ్, మైనర్ టింబర్ డిపోలకు అనుమతి
- కొబ్బరికాయలు, వెదురు, సుగంధ ద్రవ్యాల కోత, ప్రాసెసింగ్, అమ్మకాలు, మార్కెటింగ్‌కు అనుమతి
- నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్, హాసింగ్ ఫైనాన్స్, మైక్రో ఫైనాన్స్ కంపెనీలు, కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ కార్యకలాపాలకు అనుమతి
- గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ రంగంతో ముడిపడి ఉన్న నీటి సరఫరా, శాటిటేషన్, విద్యుత్ స్థంభాలు, టెలిఫోన్ కేబుల్స్ తదితర పనులకు అనుమతి.
చదవండి : ‘లాక్‌డౌన్’ ఆంక్షలు.. సడలింపులు..
Comments
Please login to add a commentAdd a comment